Strait of Hormuz: మిడిల్ ఈస్ట్ సంక్షోభం రోజురోజుకు పెరుగుతోంది. ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పరిస్థితులు వేడెక్కాయి. ఈ ఘర్షణలు ఏడో రోజుకు చేరకున్నాయి. ఇరు దేశాలు వైమానిక దాడులు, క్షిపణి దాడులు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్‌తో వివాదం పెరుగుతున్న నేపథ్యంలో ‘‘హార్మూజ్ జలసంధి’’ని ఇరాన్ మూసివేయవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇదే జరిగితే, ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభం తప్పదు.
శ్రీలంకలో చమురు సంక్షోభం నెలకొన్నది. దేశంలో చమురు నిల్వలు అడుగంటాయి. లంకలోని అనేక ప్రాంతాల్లో ఫిల్లింగ్ స్టేషన్లలో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా సమయంతో అనేక రంగాలు ఇబ్బందులు ఎదుర్కొనడంతో ఆర్థికంగా ఆ దేశం చాలా నష్టపోయింది. విదేశీ మారకనిల్వలు అడుగంటిపోవడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చమురును దిగుమతి చేసుకోవడానికి కూడా ఆ దేశం వద్ద నిధులు లేకుండా పోయాయి. ఇటీవలే రెండు షిప్పుల్లో చమురు శ్రీలంకకు…