Ayatollah Mojtaba Khamenei: మరణానికి చేరువలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్.? వేగంగా సాగుతున్న సమాధి పనులు..
- అపస్మారక స్థితిలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్..
- మరణానికి చేరువలో మొజ్తబా ఖమేనీ..
- ఇరాన్ ఖోమ్ నగరంలో భారీ సమాధి నిర్మాణం..
- యూఎస్-ఇజ్రాయిల్ ఇంటెల్ నివేదిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayatollah Mojtaba Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా మొజ్తబా ఖమేనీ ‘‘అపస్మారక స్థితి’’లో ఉన్నారని ది టైమ్స్ పత్రిక నివేదించింది. ఇరాన్‌లో పవిత్ర నగరమైన ఖోమ్‌లో చికిత్స పొందుతున్నట్లుగా సమాచారం. ఒక దౌత్యపరమైన మెమోను ఉటంకిస్తూ 56 ఏళ్ల మత గురువు తీవ్ర అనారోగ్య సమస్యల్లో ఉన్నట్లు తేలింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నికైన తర్వాత మొజ్తబా ఒక్కసారి కూడా బహిరంగంగా కనిపించ లేదు. ఇజ్రాయిల్, అమెరికా జరిపిన దాడుల్లో తీవ్రంగా గాయపడినట్లు గతంలో పలు నివేదికలు వెల్లడించాయి.
మొజ్తబా ఖమేనీ ఖోమ్‌లోని తీవ్రమైన పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నట్లు గల్ఫ్ దేశాలతో అమెరికా, ఇజ్రాయిల్ పంచుకున్న నిఘా సమాచారంలో ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వ నిర్ణయాల్లో పాలుపంచుకోలేని స్థితిలో ఖమేనీ ఉన్నారు. ఆయన ఉన్న ప్రదేశం గురించి అమెరికా, ఇజ్రాయిల్‌లకు తెలిసిన కొంతకాలంగా దానిని బహిరంగంగా వెల్లడించలేదు.
Also Read
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్‌న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్‌కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
Read Also: PEDDI : పెద్ది ఏప్రిల్ 30 రిలీజ్ వాయిదా ఫిక్స్.. న్యూ రిలీజ్ డేట్ ఇదే
ఫిబ్రవరి 28లో యూఎస్-ఇజ్రాయిల్ దాడుల్లో అప్పటి సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ హత్యకు గురయ్యారు. ఈ దాడిలోనే మొజ్తబా కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. సీనియర్ ఖమేనీ భౌతికకాయాన్ని ఖోమ్ నగరంలో ఖననం చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. యూఎస్, ఇజ్రాయిల్ ఇంటెల్ ప్రకారం.. ఖోమ్‌లో ఒక పెద్ద సమాధి మందిరాన్ని నిర్మించడానికి అవసరమైన పనుల్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలోనే అలీ ఖమేనీ, ఆయన కుటుంబాన్ని ఖననం చేసే అవకాశం ఉంది.
ఈ సమాధి నిర్మాణంలోనే మొజ్తబా ఖమేనీని ఖననం చేయవచ్చని టైమ్స్ నివేదిక పేర్కొంది. దీనిని బట్టి ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ పరిస్థితి కూడా విషమంగా ఉండొచ్చని తెలుస్తోంది. ఈ నివేదికపై వాషింగ్టన్ కానీ, టెహ్రాన్ కానీ అధికార ప్రకటన చేయలేదు. యూఎస్, ఇజ్రాయిల్ దాడుల్లో మొజ్తబా ఖమేనీ గాయపడినట్లు ఇరాన్ కూడా ధ్రువీకరించింది ఈ దాడిలో అతడి తండ్రి, తల్లి, భార్య జహ్రా హద్దాద్-అడెల్, అతని కుమారుల్లో ఒకరు మరణించారు. ఖమేనీ తీవ్రగాయాలతో కోమాలో ఉన్నారని చాలా నివేదికలు చెప్పాయి.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!