Site icon NTV Telugu

Khamenei: అజ్ఞాతంలోకి ఖమేనీ.. కీలక సమావేశానికి డుమ్మా!

Khamenei

Khamenei

ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్‌పై దాడికి అమెరికా సిద్ధమవుతోంది. అణు ఒప్పందం చేసుకోకపోతే దాడి జరగడం ఖాయమని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. ఇందుకు తాజా పరిణామాలే ఉదాహరణగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ నుంచి ఉద్భవించిందే బీజేపీ.. కలిసొచ్చింది ఏమీలేదన్న మోహన్ భగవత్

ఖమేనీ 37 ఏళ్ల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని ఉల్లంఘించారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి 8న ఇరాన్ వైమానిక దళ కమాండర్ల సమావేశం జరుగుతుంది. ఇది 1979 నుంచి వస్తున్న చారిత్రాత్మకంగా వస్తుంది. ఈ సమావేశానికి ఎప్పుడూ ఖమేనీ హాజరవుతుంటారు. అయితే ఖమేనీ స్థానంలో సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దుల్‌రహీం మౌసావి హాజరయ్యారు. 1989 నుంచి ఖమేనీ నాయకత్వం వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ వార్షిక సమావేశానికి హాజరవుతున్నారు. COVID-19 మహమ్మారి సమయంలో కూడా హాజరయ్యారు. అలాంటిది ఆదివారం (08-02-2026)న జరిగిన సమావేశానికి హాజరవ్వలేదు. అయితే ఇరాన్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. ట్రంప్ ఆదేశాలతో ఇప్పటికే యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక అరేబియా సముద్రంలో మోహరించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌక. రంగంలోకి దిగితే ఇరాన్ సర్వనాశనం అవుతుంది. ఈ నేపథ్యంలో ఖమేనీ మిత్రదేశంలోకి సేఫ్‌గా వెళ్లిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Naravane Book: నరవణే పుస్తకం రాహుల్‌గాంధీ చేతికి ఎలా వచ్చింది? కేంద్రం ఆరా

Exit mobile version