పశ్చిమాసియా మరోసారి అట్టుడుకుతోంది. ఇరాన్‌లోని అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. వైమానిక దాడుల్లో ఇరాన్‌లో శక్తివంతమైన రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హుస్సేన్ సలామి మరణించారు. ఈ మేరకు ఇరాన్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.
లెబనాన్ రాజధాని బీరుట్ సమీపంలోని ఓ గ్రామంపై ఇజ్రాయెల్ సైన్యం బాంబు దాడి చేసింది. ఈ దాడిలో 7 మంది చిన్నారులు సహా 23 మంది మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఇజ్రాయెల్, లెబనాన్‌లోని హిజ్బుల్లా మధ్య భారీ బాంబు దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(IDF) లెబనాన్ లోపల హిజ్బుల్లా లక్ష్యాలపై వైమానిక దాడులు చేస్తోంది.
ఇరాన్ క్షిపణి దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటుందనే భయం పెరుగుతోంది. కాగా, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతపై అభివృద్ధి చెందిన దేశాల సమూహం జీ-7 అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ప్రస్తుత ఛైర్‌పర్సన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఈ సమావేశానికి పిలుపునిచ్చారు.
Iran : ఉత్తర ఇజ్రాయెల్‌లోని బీట్ హిల్లెల్ నగరంపై ఆదివారం హిజ్బుల్లా కత్యుషా రాకెట్లను ప్రయోగించారు. ఇరాన్ నుంచి నిరంతర మద్దతు పొందుతున్న ఈ ఉగ్రవాద సంస్థ.. పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలిపే ఉద్దేశంతో ఈ దాడులు జరిగాయని పేర్కొంది.
Israeli Attack : రఫాలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కనీసం 44 మంది పాలస్తీనియన్లు మరణించారు. కొన్ని గంటల తర్వాత ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ... భూమి దాడికి ముందు దక్షిణ గాజా నగరం నుండి వేలాది మంది ప్రజలను తరలించడానికి ఒక ప్రణాళికను రూపొందించాలని సైన్యాన్ని కోరినట్లు చెప్పారు.