Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్‌పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
- పర్వత సొరంగాల్లో ఇరాన్ అణు పదార్థం.
- ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ నివేదిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Iran: ఇరాన్ అణు కార్యక్రమాల గురించి ఇజ్రాయిల్ సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. నటాంజ్ సమీపంలోని పికాక్స్ పర్వతం( మౌంట్ కోలాంగ్) వద్ద ఉన్న లోతైన సొరంగాల్లో యురేనియాన్ని ఎన్రిచ్ చేసే వేలాది సెంట్రిఫ్యూజ్‌లను తరలించినట్లు ఇజ్రాయిల్ నిఘా సంస్థలు భావిస్తున్నాయి. జూన్ 2025 యుద్ధంలో ఇరాన్ మూడు అణు కేంద్రాలు దెబ్బతిన్న తర్వాత వీటిని తరలించినట్లు తెలుస్తోంది. పర్వతం కింద వందల అడుగుల లోతులో నిర్మించిన ఈ కేంద్రాన్ని వైమానిక దాడుల్ని తట్టుకునేలా రూపొందించారని నివేదిక చెప్పింది.
పికాక్స్ పర్వత సముదాయం 300 నుండి 450 అడుగుల రాతి పొర కింద ఉంది. ఈ లోతు కారణంగా, సంప్రదాయ వైమానిక దాడులతో దీనిని నాశనం చేయడం అత్యంత సవాలుతో కూడుకున్నది. ఇజ్రాయెల్ నిఘా నివేదికల ప్రకారం, గత 15 నెలలుగా అక్కడ ట్రక్కుల రాకపోకలు, సొరంగాల పటిష్టత పనులు జరిగాయి. ఇరాన్ ఈ ప్రదేశానికి IAEA (అంతర్జాతీయ అణుశక్తి సంస్థ)కు కూడా ప్రవేశాన్ని కల్పించలేదు. దీని గురించి ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు. ఇరాన్ వద్ద సుమారుగా 454 కిలోల 60 శాతం ఎన్రిచ్ చేసిన యురేనియం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇది ఆయుధ తయారీకి అనువైన స్థాయి.
Also Read
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
- Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. పికాక్స్ పర్వతంపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇటీవల ఈ ప్రాంతంలో చాలా తక్కువ కార్యకలాపాలు కనిపించాయి. ఈ దాడులు ఇరాన్లో అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తిగా ఆపడంలో విఫలమైందని ఇజ్రాయిల్ సైనికాధికారులు భావిస్తున్నారు. పికాక్స్ పర్వతం సహా చాలా చోట్ల ఇంకా దాడులు చేయాల్సిన అవసరం ఉందని విశ్వసిస్తున్నారు.
తాజావార్తలు
-
Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
-
LPG Subsidy Rule: గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!