US-Iran: మెత్తబడ్డ ఇరాన్.. అమెరికాతో అణు ఒప్పందానికి గ్రీన్‌సిగ్నల్!

  • మెత్తబడ్డ ఇరాన్
  • అమెరికాతో అణు ఒప్పందానికి గ్రీన్‌సిగ్నల్!
  • స్విట్జర్లాండ్‌లో వెళ్లిన ఇరాన్ విదేశాంగ మంత్రి
Trump

Trump

అమెరికా-ఇరాన్ మధ్య ఓ రేంజ్‌లో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఏ క్షణంలోనైనా ఇరాన్‌పై అమెరికా దాడి చేయొచ్చని వార్తలు వచ్చాయి. అణు ఒప్పందం చేసుకోకపోతే దాడులు జరుగుతాయని ట్రంప్ పదే పదే వార్నింగ్‌లు ఇస్తూ వచ్చారు. అయితే తొలుత ఇరాన్ మొండికేసింది. ఇప్పుడు ఏమైందో.. ఏమో తెలియదు గానీ మెత్తబడినట్లుగా తెలుస్తోంది.

అమెరికాతో అణు చర్చలకు సిద్ధమని ఇరాన్ సంకేతం ఇచ్చింది. దీంతో ఇరాన్‌ విదేశాంగమంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ స్విట్జర్లాండ్‌లోని జెనీవాకు వెళ్లారు. మంత్రితో పాటు ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం వెళ్లింది. అణు ఒప్పందంపై అమెరికాతో కీలక చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే తొలి దశ చర్చలు ఒమన్‌లోని మస్కట్‌లో గతవారం జరిగాయి.

ఇది కూడా చదవండి: IAS Prasad: నిత్య పెళ్లికొడుకులా మారిన ఐఏఎస్ అధికారి.. ఇప్పటికే ఇద్దరు కలెక్టర్లతో పెళ్లి.. తాజాగా మూడో ట్విస్ట్ ఏంటంటే..!

గత డిసెంబర్ 28 నుంచి ఇరాన్‌లో ఉద్రిక్తతలు జరుగుతున్నాయి. ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. దీంతో 30 వేల మంది నిరసనకారులు చనిపోయారు. ఈ నేపథ్యంలో హత్యలు ఆగకపోతే దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇక తాజాగా అణు ఒప్పందం చేసుకోకపోతే కచ్చితంగా చేస్తామని బెదిరించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ ఒప్పందానికి ముందుకొచ్చింది.

ఇది కూడా చదవండి: Shashi Tharoor: ప్రియాంక చోప్రాతో వేదిక పంచుకోకవడంపై శశిథరూర్ జోక్.. వైరల్‌ అవుతోన్న కామెంట్‌