ఎట్టకేలకు ఇరాన్ దిగొచ్చింది. అమెరికాతో అణు ఒప్పందం చేసుకొనేందుకే సిద్ధపడింది. అమెరికాతో న్యాయమైన అణు ఒప్పందం చేసుకోవడానికి ఎదురుచూస్తున్నట్లు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సన్నిహితుడు అలీ షమ్ఖానీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఇరాన్‌కి మరోసారి అణు ఒప్పందం విషయంలో తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందం చేసుకుంటే మంచిది అని.. లేదంటే పెద్ద ప్రమాదంలో పడతారని ట్రంప్ హెచ్చరించారు. సోమవారం ట్రంప్‌తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భేటీ అయ్యారు.