అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 837 మంది నిరసనకారులను ఉరితీసేందుకు ఇరాన్ సిద్ధమైంది. దీంతో అగ్ర రాజ్యం అమెరికా అప్రమత్తమైంది. అమెరికాకు చెందిన అతి పెద్ద యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక్ ఇరాన్ సమీపంగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు ఇజ్రాయెల్ కూడా యుద్ధానికి రెడీ అవుతోంది. పరిస్థితులు ఏదో తేడాగా ఉన్నాయని గమనించిన ఇరాన్.. ‘‘మేము ట్రిగ్గర్‌లో ఉన్నాము.’’ అని పేర్కొంది. మొత్తానికి పరిస్థితులేవో తేడా కొడుతున్నాయి. మరో యుద్ధం ఖాయం అన్నట్టుగా అనిపిస్తోంది.

ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘అతి పెద్ద నౌకాదళం ఇరాన్ దిశగా వెళ్తోంది. ఏం జరుగుతుందో చూద్దాం. పెద్ద సైన్యం ఇరాన్ వెళ్తోంది. ఏమీ జరగకూడదనే నేను కోరుకుంటున్నాను. కానీ మేము వారిని చాలా నిశితంగా గమనిస్తున్నాము. గురువారం నాడు యువకులైన 837 మందిని ఉరితీయబోతున్నారు… నేను వారితో.. మీరు ఆ ప్రజలను ఉరితీస్తే.. మీరు ఇంతకు ముందు ఎన్నడూ చూడనంత తీవ్రమైన దెబ్బను ఎదుర్కొంటారు. మేము మీ ఇరాన్ అణు కార్యక్రమానికి చేసిన దానితో పోలిస్తే ఇది చాలా పెద్దదిగా ఉంటుంది అని చెప్పాను. ఈ భయంకరమైన సంఘటన జరగడానికి ఒక గంట ముందు.. వారు దానిని రద్దు చేశారు. అది ఒక మంచి సంకేతం. కానీ మా దగ్గర ఒక భారీ నౌకాదళం ఉంది. ఆ దిశగా ఒక భారీ నౌకా సముదాయం వెళ్తోంది. బహుశా మనం దానిని ఉపయోగించాల్సిన అవసరం రాకపోవచ్చు. చూద్దాం.’’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.

యూఎస్ఎస్ అబ్రహం లింకన్
యూఎస్ఎస్ అబ్రహం లింకన్ అతి పెద్ద నౌక. ఈ నౌక శత్రువుల అంతు చూస్తోంది. ఇరాన్ సైన్యాన్ని ఒక దెబ్బకు నాశనం చేయగల సామర్థ్యం దీని సొంతం. ఈ యుద్ధనౌకతో పాటు గైడెడ్ మిస్సైల్ క్రూయిజర్లు, డిస్ట్రాయర్లు, జలాంతర్గాములు, ఇతర నౌకలతో స్ట్రైక్ గ్రూప్ ఉంటుంది. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌకలో ప్రాణాంతక యుద్ధ విమానాలు ఉంటాయి. యుద్ధానికి దిగితే భూమి నుంచి.. సముద్రం నుంచి.. ఆకాశం నుంచి ఎక్కడి నుంచైనా శత్రువును దెబ్బకొట్టగల సామర్థ్యం ఉంటుంది. తనకేమైనా జరిగితే భూమ్మీద ఇరాన్ లేకుండా చేస్తానని ట్రంప్ బెదిరించడానికి ఈ నౌకను బట్టేనని సమాచారం. అమెరికా దగ్గర ఉన్న విధ్వంసక ఆయుధాలు ఇరాన్ మొత్తాన్ని సర్వనాశనం చేయగలదని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి స్థావరాలు, ప్రమాదకర లక్ష్యాలను నిమిషాల్లోనే లక్ష్యం చేసుకోగల శక్తి ప్రస్తుతం అమెరికా దగ్గర ఉంది.

ఇక ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థ.. అమెరికా జెట్‌లను.. క్షిపణులను అడ్డుకోవడం కష్టమని నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్ ఎదుర్కోలేని ఆయుధాలు అమెరికా దగ్గర ఉన్నాయని.. ఇటీవల ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు B-2 బాంబర్లు ఇరాన్ అణు సౌకర్యాలను దెబ్బతీశాయని గుర్తుచేస్తున్నారు. ఇంకొక విశేషం ఏంటంటే.. B-2 బాంబర్లను ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థ గానీ.. రాడర్ వ్యవస్థ కూడా గుర్తించలేవు. ఇరాన్‌కు ప్రస్తుతానికి సాధ్యం కాదు.. ఇప్పట్లో దాదాపు సాధ్యం కాదు. అంటే ప్రస్తుతం అమెరికాతో పెట్టుకుంటే.. ఇరాన్ తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది.

ఇంకో అతి పెద్ద వార్త ఏంటంటే.. అమెరికా తాజాగా మరో 52 కొత్త B-2 బాంబర్లను తయారు చేస్తోంది. ఇవి మరింత శక్తివంతమైనవిగా చెబుతున్నారు. ఇక అమెరికా దగ్గర టోమాహాక్ క్షిపణులు ఉన్నాయి. ఇవి కచ్చితమైన దాడులకు ప్రసిద్ధి చెందినవి. ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరిన క్షిపణులు ఇవే. అయితే టోమాహాక్ క్షిపణులు అందించేందుకు ట్రంప్ నిరాకరించారు. ప్రపంచంలోనే గుర్తింపు పొందిన టోమాహాక్ క్షిపణులు ప్రస్తుతం అమెరికాకు మాత్రమే సొంతం. ఒక వేళ టోమాహాక్ క్షిపణులతో ఇరాన్‌పై దాడి చేస్తే ఇరాన్ నగరాలు భారీ విధ్వంసాన్ని చూడాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: UAE: నేడు యూఏఈలో రష్యా-అమెరికా-ఉక్రెయిన్ కీలక భేటీ.. చర్చలపై సర్వత్రా ఉత్కంఠ
ఇక అమెరికా దగ్గర ఉన్న F-35, F-32లు ప్రపచంలోనే అత్యంత అధునాతన యుద్ధ విమానాలుగా పరిగణిస్తారు. ఈ రెండు కూడా ఐదవ తరం యుద్ధ విమానాలు. అవి అత్యంత ప్రమాదకరమైనవి. ప్రస్తుతం ఇరాన్ దగ్గర దశాబ్దాల నాటి యుద్ధ విమానాలే ఉన్నాయి. అమెరికన్ ఆయుధాలను ఎదుర్కొనే శక్తి ప్రస్తుతానికి ఇరాన్ దగ్గర లేదు. ఇక అమెరికా దగ్గర ఇరాన్‌ను ట్రేస్ చేసే యుద్ధ విమానాలు ఉన్నాయి. అంతేకాకుండా అమెరికా దగ్గర MQ-9 రీపర్ అనేది 50, 000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న ప్రమాదకరమైన డ్రోన్లు, 1,850 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. ఈ నేపథ్యంలో అమెరికాను ఇరాన్ ఏ విధంగా ఎదుర్కోగలదో అన్న విషయం అనుమానామే.
ఇజ్రాయెల్ అలర్ట్..
ఇదిలా ఉంటే అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా అప్రమత్తం అయింది. ఇజ్రాయెల్ కూడా యుద్ధ వాతావరణంలోకి దిగింది. ఇరాన్ నుంచి ఎదురయ్యే ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఇజ్రాయెల్ అలర్ట్ చేసింది. సైన్యం సిద్ధంగా ఉండాలని ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్ పేర్కొన్నారు. మా సైన్యం పూర్తి హై అలర్ట్‌లో ఉందని ఇజ్రాయెల్ వార్తాపత్రిక ది టైమ్స్ పేర్కొంది.
#WATCH | US President Donald Trump says, "We have a big flotilla going in that direction, and we'll see what happens. We have a big force going toward Iran. I'd rather not see anything happen, but we're watching them very closely…"
He adds, "…837 mostly young men were going… pic.twitter.com/KRSM7VPPHq
— ANI (@ANI) January 23, 2026