‘ఊబెర్ ఈట్స్’ సరికొత్త రికార్డు.. అంతరిక్షంలో ఫుడ్ డెలివరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫీసులోనో.. ఇంట్లోనో.. కూర్చొని.. నచ్చిన ఫుడ్, మెచ్చిన హోటల్ నుంచి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లో ఆర్డర్ చేస్తే.. కోరుకున్న చోటుకే ఫుడ్ వచ్చేస్తోంది.. ఇదంతా ఏ సిటీ, టౌన్‌లోనే అయితేనే సాధ్యం.. కానీ, ఆ హద్దులు చెరిపేసి.. అంతరిక్షంలోనూ ఫుడ్ డెలివరీ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది ‘ఊబెర్ ఈట్స్’ ఫుడ్ డెలివరీ యాప్.. అయితే, అంతరిక్షం నుంచి ఆర్డర్ రావడం ఏంటి..? ఆ ఆర్డర్ ఎలా డెలివరీ చేశారు..? అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా సాగింది..
Read Also: చిన్నారులపై ఒమిక్రాన్ పడగ..! ముప్పు తప్పదా..?
Also Read
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
అంతరిక్షంలో ఫడ్ డెలివరీకి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొత్త ప్రదేశాలను వెళ్లాలని, ప్రపంచాన్నే చుట్టేయలని ఎందరికో ఉంటుంది.. కొందరు తమ కోరికలను నేరవేర్చుకోవడానికి ఎంతైనా శ్రమిస్తారు.. ఇక, డబ్బులు ఉన్నవారి అయితే.. అది పెద్ద సమస్యే కాకపోవచ్చు.. అయితే, జపాన్ బిలియనీర్ యుసాకు మేజావాకు అంతరీక్ష ప్రయాణం అంటే ఎంతో ఇష్టం.. కొన్ని వందల కోట్లు పెట్టి ఆయన ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కాలు పెట్టి తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నారాయన.. ఈ సందర్భాన్నే ఊబెర్ ఈట్స్ ఉపయోగించుకుని అంతరిక్షంలోకి ఫుడ్ డెలివరీ చేసింది.. ఎలా అంటే..? ఈ నెల 11వ తేదీన అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు యుసాకు మేజావా.. ఆయనతో పాటే ఊబెర్ ఈట్స్ నుంచి కొన్ని ఆహార పదార్థాలు కూడా అంతరిక్షంలోకి వెళ్లాయి.. ఆయన అంతరిక్షంలోకి చేరుకున్న 9 గంటల తర్వాత ఊబెర్ ఈట్స్ ఫుడ్‌ను.. అది కూడా ఊబెర్ ఈట్స్ క్యాప్ పెట్టుకుని మరీ అక్కడి వ్యోమగాములకు అందించారు. మొత్తంగా ఓ బిలియనీర్ సహాయంతో అంతరిక్షంలోనూ ఫుడ్ డెలివరీ చేసి సరికొత్త చరిత్రను సృష్టించింది ఊబెర్ ఈట్స్.. ఇక, ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఊబెర్ ఈట్స్.. మేం ఎక్కడికైనా చేరుకుంటాం.. ఏదైనా డెలివరీ చేస్తాం… ఇది ప్రారంభం మాత్రమే అంటూ కామెంట్ పెట్టింది.. ఊబెర్ ఈట్స్ షేర్ చేసిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది..
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!