అమెరికాలో దారుణం జరిగింది. భారతీయ వ్యక్తి ఘాతుకానికి పాల్పడ్డాడు. కుటుంబ వివాదాల్లో అదుపు తప్పి తుఫాకీతో కాల్పులు జరపగడంతో భార్య, ముగ్గురు బంధువులు ప్రాణాలు కోల్పోయారు. పిల్లలు వేరే గదిలో తలదాచుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఒకేసారి నలుగురు హత్యకు గురి కావడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఇక ఈ ఘటనతో పిల్లలు హడలెత్తిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: PM Modi: మహిళ పాదాలకు నమస్కరించిన మోడీ.. వీడియో వైరల్
అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని లారెన్స్విల్లే నగరంలో విజయ్ కుమార్ (51) అనే భారతీయ కుటుంబం నివాసం ఉంటుంది. అయితే శుక్రవారం తెల్లవారుజామున కుటుంబంలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో కోపోద్రేకుడైన విజయ్ కుమార్ తుపాకీ తీసుకుని కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో భార్య మీము డోగ్రా (43), బంధువులు గౌరవ్ కుమార్ (33), నిధి చందర్( 37), హరీశ్ చందర్ ( 38) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు పిల్లలు వేరే గదిలో ఉండడంతో ప్రాణాలతో బయటపడ్డారు.
ఇది కూడా చదవండి: US: అమెరికాపై మంచు ఖడ్గం.. 2,700 విమానాలు రద్దు
ఈ ఘటనలో అట్లాంటాలోని భారతీయ కాన్సులేట్ జనరల్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని.. మృతుల కుటుంబానికి సాధ్యమైనంత సహాయం చేస్తామని తెలిపింది. ఇక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది.
విజయ్ కుమార్ అట్లాంటాలో ఉంటున్నాడు. ఇతడిపై నాలుగు తీవ్రమైన నేరాలు ఉన్నాయి. నాలుగు హత్యా నేరాలు, నాలుగు ఉద్దేశ పూర్వక హత్యా నేరాలు, పిల్లలపై క్రూరత్వ నేరంతో పాటు అనేక నేరాలు ఉన్నాయి. తాజాగా పిల్లలు తప్పించుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు గానీ.. లేకపోతే వారి ప్రాణాలు కూడా పోయేవి.