ఉక్రెయిన్ -రష్యా ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ వేలాదిమంది భారతీయులు చిక్కుకుని పోయారు. ఆపరేషన్ గంగ ద్వారా కేంద్ర విదేశాంగ శాఖ యుద్ధ ప్రాతిపదికన విద్యార్ధుల్ని తరలిస్తోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విద్యార్ధుల తరలింపుపై కీలక ప్రకటన చేశారు. రొమేనియా నుంచి 31 విమానాల్లో 6680 మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి తరలించామన్నారు. పోలెండ్ నుంచి 13 విమానాల్లో 2822 మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి తరలించారు. హంగేరి నుంచి 26 విమానాల్లో…