Site icon NTV Telugu

Modi-Trump: వాణిజ్యంపై కొలిక్కిరాని 5వ రౌండ్ చర్చలు.. దగ్గరపడుతున్న డెడ్‌లైన్!

Trump

Trump

భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా కొలిక్కిరాలేదు. తాజాగా జరిగిన ఐదో రౌండ్ చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. ఆగస్టు 1 వరకు ట్రంప్ గడువు విధించారు. అమెరికా విధించిన డెడ్‌లైన్ దగ్గర పడుతోంది. అయినా కూడా ఇరు దేశాల మధ్య చర్చలు మాత్రం ముగింపునకు రాలేదు. ఇంకా తీవ్ర సందిగ్ధం నెలకొంది.

ఇది కూడా చదవండి: Lok sabha: ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు అనుమతి.. ఎన్ని గంటలంటే..!

ఏప్రిల్ 2న ఆయా దేశాలపై ట్రంప్ సుంకాలు పెంచేశారు. అయితే దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో 90 రోజుల పాటు వాయిదా వేశారు. అయినా చర్చలు అసంపూర్తిగా మిగలడంతో తిరిగి ఆగస్టు 1 వరకు పొడిగించారు. ఇక భారత్-అమెరికా మధ్య చర్చలు నడుస్తున్నాయి. తాజాగా జరిగిన ఐదో రౌండ్ చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. అయితే మార్కెట్ యాక్సెస్ కోసం అమెరికా కొత్త డిమాండ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది.

ఇది కూడా చదవండి: CBSE: సీబీఎస్‌ఈ పాఠశాలల్లో కొత్త నిబంధనలు.. ఆదేశాలు జారీ

అమెరికా వ్యవసాయం, పాడి పరిశ్రమపై రాయితీలు కోరుతుంటే.. భారతదేశం అదనంగా 26 శాతం సుంకాలను తొలగించాలని కోరుతోంది. ఉక్కు (50%), అల్యూమినియం, ఆటోమొబైల్స్ (25%) పై సుంకాలను తగ్గించాలని ఒత్తిడి చేస్తోంది. వస్త్రాలు, తోలు, రత్నాలు మరియు ఆభరణాలు, ప్లాస్టిక్‌లు మరియు అరటిపండ్లు మరియు నూనెగింజలు వంటి వ్యవసాయ వస్తువుల వంటి శ్రమతో కూడిన రంగాలకు కూడా సుంకం రాయితీలను భారత్ కోరుతోంది. అమెరికా పారిశ్రామిక వస్తువులు, ఎలక్ట్రిక్ వాహనాలు, వైన్లు, పెట్రోకెమికల్స్, పాల ఉత్పత్తులు, ఆపిల్లు, చెట్ల గింజలు మరియు జన్యుపరంగా మార్పు చెందిన పంటలపై అమెరికా సుంకాలను కోరుతోంది. వీటిపై చర్చలు కొలిక్కి రాక సందిగ్ధం నెలకొంది.

Exit mobile version