భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా కొలిక్కిరాలేదు. తాజాగా జరిగిన ఐదో రౌండ్ చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. ఆగస్టు 1 వరకు ట్రంప్ గడువు విధించారు. అమెరికా విధించిన డెడ్‌లైన్ దగ్గర పడుతోంది. అయినా కూడా ఇరు దేశాల మధ్య చర్చలు మాత్రం ముగింపునకు రాలేదు. ఇంకా తీవ్ర సందిగ్ధం నెలకొంది.