NTV Telugu Site icon

UN: ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు పెరుగుతున్న మద్దతు.. తాజాగా భూటాన్, పోర్చుగల్ సపోర్టు

Unindia

Unindia

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం యొక్క బిడ్‌కు యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, బ్రిటన్ మద్దతు ఇచ్చాయి. తాజాగా భూటాన్, పోర్చుగల్ కూడా సంపూర్ణ మద్దతు తెలిపాయి. ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ దశాబ్దాలుగా పోరాటం చేస్తోంది. ఇందుకోసం భారత్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భారత్‌ ప్రయత్నాలకు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాలు భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం మద్దతు ప్రకటించాయి. తాజాగా ఈ జాబితాలోకి భూటాన్, పోర్చుగల్ చేరాయి. న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశంలో భారత్‌కు మద్దతు ప్రకటించాయి.

బ్రెజిల్, భారత్‌లను శాశ్వత సభ్యులుగా చేయాలని పోర్చుగీస్ ప్రధాని అన్నారు. యూఎన్ జనరల్ అసెంబ్లీ సెషన్‌లో భూటాన్, పోర్చుగల్ ఇండియాకు మద్దతు ప్రకటించాయి. గ్లోబల్ సౌత్‌లో గణనీయమైన ఆర్థిక వృద్ధి, నాయకత్వంతో భారతదేశం శాశ్వత సీటుకు అర్హుడని భూటాన్ ప్రధాన మంత్రి షెరింగ్ టోబ్గే అన్నారు.

యునైటెడ్ స్టేట్స్, యూకే, చైనా, ఫ్రాన్స్, రష్యా UNSCలో ఐదు శాశ్వత సభ్యులుగా ఉన్నాయి. ఏదైనా తీర్మానం లేదా నిర్ణయంపై వీటో అధికారాలను కలిగి ఉన్నాయి. అయితే భారత్ ప్రయత్నాలను చైనా తిప్పుకొడుతూ ఉంది. మొత్తానికి ఇన్నాళ్లకు ఆయా దేశాల మద్దతు సంపూర్ణంగా లభించింది.