ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం యొక్క బిడ్‌కు యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, బ్రిటన్ మద్దతు ఇచ్చాయి. తాజాగా భూటాన్, పోర్చుగల్ కూడా సంపూర్ణ మద్దతు తెలిపాయి. ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ దశాబ్దాలుగా పోరాటం చేస్తోంది.