India Gift To Vietnam: వియత్నాంకు భారత యుద్ధ నౌక .. కానుకగా ఇచ్చిన ఇండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Gift To Vietnam: రక్షణ రంగంలో అభివృద్ధి చెందుతున్న భారత దేశం వియత్నాంకు యుద్ధ నౌకను కానుకగా ఇచ్చింది. భారత నౌకాదళానికి 32 ఏళ్లుగా సేవలందించిన ‘ఐఎన్ఎస్ కృపాణ్’ యుద్ధనౌకను వియత్నాంకి ఇండియా బహుమతిగా అందజేసింది. వియత్నాం పర్యటనలో ఉన్న భారత నౌకాదళం అధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ ఈ యుద్ధనౌకను ‘వియత్నాం పీపుల్స్ నేవీ’కి అప్పగించారు. సేవలందిస్తున్న ఓ యుద్ధనౌకను భారత్ తన మిత్రదేశానికి బహుమతిగా ఇవ్వడం, దేశీయంగా నిర్మించి, ఆయుధాలతో పూర్తి యుద్ధ సన్నద్ధంగా ఉన్న నౌకను భారత్ ఇలా ఒక మిత్ర దేశానికి నజరానాగా ఇవ్వడం ఇదే మొదటిసారి. వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇది నిదర్శనంగా నిలుస్తుందని భారత నౌకాదళం వెల్లడించింది. స్నేహపూర్వక దేశాలకు సాయం చేయడంతోపాటు వారి రక్షణ సామర్థ్యాలను మెరుగుపరిచే విషయంలో భారత్ నిబద్ధతను ఇది చాటుతుందని నౌకాదళం తెలిపింది. దక్షిణ చైనా సముద్రమంతా తనదేనంటూ గిల్లికజ్జాలకు పాల్పడుతున్న చైనా దూకుడును అడ్డుకునేలా భారత్, వియత్నాంలు చేయీచేయీ కలుపుతున్నాయనడానికి తాజా పరిణామం నిదర్శనం.
Read also: Bareilly: నాకు ఇల్లు వద్దు.. బాయ్‌ఫ్రెండ్ కావాలి.. పీఎం హౌసింగ్ స్కీమ్ డబ్బులు పడగానే భార్య పరార్
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
పక్కలో బళ్లెంలా మారిన చైనా దూకుడును తగ్గించడానికి అందివచ్చిన అవకాశాలను భారత్ వినియోగించుకుంటున్నది. తనతో స్నేహపూర్వంగా ఉండే దేశాలకు సహాయం చేస్తూ వస్తున్నది. ఇందులో భాగంగా చైనా పొరుగు దేశమైన వియత్నాంకు యుద్ధ నౌక ఐఎన్ఎస్ కృపాణ్‌ను అందించింది. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి గుర్తుగా 32 ఏండ్లుగా ఇండియన్ నేవీకి సేవలందిస్తున్న ఈ యుద్ధ నౌకను కానుకగా ఇచ్చింది. దక్షిణ చైనా సముద్రమంతా తనదేనంటూ ఆధిపత్యం ప్రదర్శిస్తూ డ్రాగన్‌ను కట్టడిచేసేలా వియత్నాంకు భారత్ సహాయం చేసినట్లయింది.
దేశీయంగా రూపొందించిన ఐఎన్ఎస్ కృపాణ్‌ను 1991లో ప్రారంభించారు. 90 మీటర్ల పొడవు, 10.45 మీటర్ల వెడల్పు, 1450 టన్నుల బరువున్న ఈ ఖుక్రీ క్లాస్ క్షిపణి యుద్ధనౌకలో సుమారు 12 మంది అధికారులు, వంద మంది నావికులు పనిచేస్తారు. దీనికి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉన్నది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి నిదర్శనంగా ఐఎన్ఎస్ కృపాణ్ యుద్ధనౌకను బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యంపై ఇరు దేశాల్లో నెలకొన్న ఆందోళనల్ని దృష్టిలో ఉంచుకొని తీర ప్రాంతంలో గస్తీని బలోపేతం చేయడం దీని ఉద్దేశమంటున్నారు. భారత్ జీ20 సదస్సు ప్రధాన థీమ్ అయిన వసుధైక కుటుంబం (ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్)లో భాగంగానే ఈ కానుక ఇచ్చినట్టు తెలిపారు. ఐఎన్ఎస్ కృపాణ్ గస్తీతో దక్షిణ చైనా జలాల్లో అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా అన్ని దేశాలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఎన్ఎస్ కృపాణ్ జూన్ 28న విశాఖపట్నం నుంచి బయల్దేరి జూలై 8 నాటికి వియత్నాం చేరింది.
- Tags
- gift
- india
- INS Kirpan
- Vietnam
- Warship
తాజావార్తలు
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!