రక్షణ రంగంలో అభివృద్ధి చెందుతున్న భారత దేశం వియత్నాంకు యుద్ధ నౌకను కానుకగా ఇచ్చింది. భారత నౌకాదళానికి 32 ఏళ్లుగా సేవలందించిన ‘ఐఎన్‌ఎస్ కృపాణ్’ యుద్ధనౌకను వియత్నాంకి ఇండియా బహుమతిగా అందజేసింది.
ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గ్యాంగ్ సోమవారం ఢిల్లీలో చర్చలు జరిపారు.