India-Iran: 48 గంటల పాటు ఇళ్లల్లోంచి బయటకు రావొద్దు.. ఇరాన్‌లోని భారతీయులకు కేంద్రం హెచ్చరిక
- 48 గంటల పాటు ఇళ్లల్లోంచి బయటకు రావొద్దు
- ఇరాన్‌లోని భారతీయులకు కేంద్రం హెచ్చరిక
- రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతం అవుతుందని ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో ఇరాన్లో ఉన్న భారతీయులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 48 గంటల పాటు ఉన్నచోటనే ఉండాలని.. సైనిక స్థావరాలకు దూరంగా ఉండాలని ఇరాన్‌లోని పౌరులకు భారత్ విజ్ఞప్తి చేసింది. భారతీయులంతా ఇంట్లోనే ఉండాలని… ముఖ్యంగా అధికారిక ఆదేశాలతో మాత్రమే రహదారి ప్రయాణాలు చేపట్టాలని.. రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని సలహా ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Trump: ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతమైపోతుంది.. ట్రంప్ చివరి హెచ్చరిక
Also Read
- India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
- Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
- Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
- Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఇరాన్ విషయంలో ట్రంప్ విధించిన గడువు ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం మంగళవారం సాయంత్రం ఒక సలహా జారీ చేసింది. భారత పౌరులు కనీసం 48 గంటల పాటు తాము ఉన్న ప్రదేశాలలోనే ఉండాలని కోరింది. ముఖ్యంగా సైనిక, విద్యుత్ కేంద్రాల వంటి సున్నితమైన ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది.
ఇది కూడా చదవండి: JD Vance: బంతి ఇరాన్లో కోర్టులో ఉంది.. చర్చలపై జేడీ వాన్స్ కీలక ప్రకటన
బహుళ అంతస్తుల భవనాలపై ఉండొద్దని తెలిపింది. ఇంట్లో ఉంటేనే క్షేమం అని పేర్కొంది. రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన హోటళ్లలో బస చేస్తున్న వారు లోపలే ఉండాలని.. రాయబార కార్యాలయ సిబ్బందితో నిరంతరం సంప్రదింపులు జరపాలని ప్రత్యేకంగా ఆదేశించింది. భారత పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని.. పరిస్థితిలో ఏవైనా మార్పులు ఉంటే అధికారిక సమాచారాన్ని నిశితంగా గమనించాలని రాయబార కార్యాలయం కోరింది.

తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!