Imran Khan: ఏడు చోట్ల పోటీ చేశాడు.. ఆరు చోట్ల గెలిచాడు..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imran Khan: పాకిస్తాన్ ఉపఎన్నికల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పార్టీ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్(PTI) సత్తా చాటింది. మొత్తం 11 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరగ్గా 8 చోట్ల PTI గెలిచింది. ఇమ్రాన్ ఖాన్ ఒక్కరే 7 స్థానాలలో పోటీ చేయగా ఆరు స్థానాల్లో విజయం సాధించారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానంలో ఓటమి చెంది పాక్ ప్రధాని పదవి కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో ఉప ఎన్నికలను ఆయన రిఫరెండంగా భావించారు. ఆయన పార్టీ తాజా విజయాలతో పాక్ ప్రజల్లో విశ్వాసాన్ని సంపాదించినట్లు తేలిందని PTI అభిప్రాయపడింది. అటు అధికారపక్షంపై ఈ స్థాయిలో విజయం సాధించడం మాములు విషయం కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
Read Also: Ram Charan: ఇన్‌స్టాగ్రామ్‌లో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ రికార్డు
Also Read
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
- Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
కాగా 11 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగ్గా అధికార పక్షం కేవలం ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. వీటిలో ఆరు నేషనల్ అసెంబ్లీ స్థానాలతో పాటు మరో రెండు అసెంబ్లీ ప్రావిన్సుల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ PTI విజయం సాధించింది. ఒక వ్యక్తి ఎన్ని స్థానాలలో అయినా పోటీ చేయవచ్చనే వెసులుబాటును ఇమ్రాన్ ఖాన్ ఉపయోగించుకున్నారు. దీంతో ఆయన ఏకంగా 7 చోట్ల పోటీ చేయడం అరుదైన విషయంగా పలువురు భావిస్తున్నారు. మరోవైపు ఆరో చోట్ల గెలిచినా ఇమ్రాన్ ఖాన్ ఎక్కడా ప్రాతినిధ్యం వహించరని PTI వర్గాలు వెల్లడించాయి. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది అక్టోబరులో పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలను నిర్వహించాలని PTI డిమాండ్ చేస్తోంది.
తాజావార్తలు
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!