Tesla Pi Phone: అదిరిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి టెస్లా స్మార్ట్‌ఫోన్.. లాంచింగ్ ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tesla Pi Phone:ప్రపంచలో అత్కధిక ధనవంతుడు ఎలన్ మస్క్ త్వరలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటికే అనేక వ్యాపారాల్లోకి అడుగుపెట్టిన మస్క్ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ వ్యాపారంపై దృష్టిపెట్టాడు. ఎలాన్ మస్క్ కు చెందిన విద్యుత్ ఆధారిత వాహనాల సంస్థ టెస్లా ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు కూడా తయారుచేస్తోంది. త్వరలోనే టెస్లా స్మార్ట్ ఫోన్ ప్రపంచ మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ కు సంబంధించి అధికారిక ప్రకటనేదీ రాకపోయినా, దీనికి సంబంధించిన అంశాలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి.
Read Also: BMW Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 230 KMPH వేగంతో లారీని ఢీకొట్టిన కారు
Also Read
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
ఇప్పటికే ఎలన్ మస్క్ ‘టెస్లా, స్పేస్ ఎక్స్, స్టార్‌లింక్, న్యూరాలింక్’ వంటి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఎలన్ మస్క్ స్మార్ట్‌ఫోన్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాడు. ఇటీవలే పర్‌ఫ్యూమ్ కూడా తీసుకొచ్చిన మస్క్ త్వరలో టెస్లా నుంచి స్మార్ట్‌ఫోన్ విడుదల చేయబోతున్నాడు. వచ్చే డిసెంబర్‌లో ‘టెస్లా పై’ పేరుతో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేస్తున్నాడు. ఈ ఫోన్ 120 రిఫ్రెష్ రేట్, 6.7 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో రానుంది. ఫోన్లో నాలుగు కెమెరాలుంటాయి. ఫోన్ వెనుకవైపు 50 ఎంపీ కెపాసిటీతో మూడు రేర్ కెమెరాలు ఉంటాయి. ముందువైపు 40 ఎంపీ పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ టెస్లా సొంత ప్రాసెసర్‌తో రూపొందుతోంది. ఈ ప్రాసెసర్ వివరాలు మరికొద్ది రోజుల్లో తెలుస్తాయి. ఫోన్ బ్యాటరీ 5,000 ఎంఏహెచ్ పవర్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ హై ఎండ్ ఫోన్‌గానే మార్కెట్లోకి రానుంది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం దీని ధర రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు ఉండొచ్చు.
Read Also: Fighter jet crashes: భవనంపై కుప్పకూలిన యుద్ధవిమానం.. చెలరేగిన మంటలు
ఈ ఫోన్లో మరో ప్రత్యేకత.. నేరుగా శాటిలైట్ నెట్‌వర్క్ కనెక్టివిటీ కలిగి ఉండటం. అయితే, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఓఎస్‌తో పనిచేస్తుందా? లేదా మరేదైనా ఓఎస్‌తో వస్తుందా? లేక టెస్లా సొంత ఓఎస్ తయారు చేస్తుందా అనే విషయాలు తెలియాలి.
తాజావార్తలు
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!