Imran Khan: ‘‘ప్రాణాలతో తిరిగి రాకపోవచ్చు’’.. నిస్సహాయ స్థితిలో ఇమ్రాన్ ఖాన్ లేఖ!
- నిస్సహక స్థితిలో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్..
- తాను ఇక ప్రాణాలతో రాకపోవచ్చని లేఖ..
- అనారోగ్య పరిస్థితుల్ని న్యాయమూర్తులకు వివరించిన ఇమ్రాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (PTI) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు బహిరంగ లేఖ రాశారు. అడియాల జైలులో తనకు, తన భార్య బుష్రా బీబీకి తక్షణ వైద్య సహాయం అందించాలని కోరారు. జైలులో సుదీర్ఘకాలం ఏకంగా నిర్బంధంలో ఉన్నందున తన ఆరోగ్యం క్షీణించిందని, ప్రస్తుత పరిస్థితుల్లో తాను ప్రాణాలతో తిరిగి రాకపోవచ్చని లేఖలో పేర్కొన్నారు. నవంబర్ 11న ఆదియాలా జైలులో ఇమ్రాన్‌ను కలిసిన ఆయన లాయర్ సల్మాన్ సఫ్దర్ ఈ లేఖ అందించి, న్యాయమూర్తులకు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.
నవంబర్ 16న పాకిస్థాన్ ఫెడరల్ కాన్స్టిట్యూషనల్ కోర్టు (FCC), సుప్రీంకోర్టు, ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. తన కంటి చూపు మందగించడం, తనకు వైద్య చికిత్స అందించాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడం ఈ లేఖ రాయడానికి కారణమని ఇమ్రాన్ పేర్కొన్నారు.
Also Read
- Israel Hezbollah: ఓవైపు కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్యలు.. హిజ్బుల్లాపై ఇజ్రాయిల్ మెరుపుదాడి!
- Thailand Phuket Fire Accident: థాయ్‌లాండ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది మృతి, 17 మందికి గాయాలు!
- India-Italy Row: ‘భారత్‌కు ప్రజాస్వామ్య పాఠాలు చెప్పొద్దు’.. మెలోనీ మిత్రపక్షం తీవ్ర అభ్యంతరం.. ఇటలీ నేతకు కౌంటర్!
- SCO 2026: ‘చేతులు నరికేస్తాం’ అన్న పాక్ మంత్రి.. ఇప్పుడు భారత్‌కు రాక..!
బీపీ పెరిగింది.. ప్రాణాలతో తిరిగి రాకపోవచ్చేమో..
ఏకాంత నిర్బంధం వల్ల తన రక్తపోటు(బీపీ) తీవ్రంగా పెరిగిందని ఇమ్రాన్ ఖాన్ తన లేఖలో ఆరోపించారు. మొదట 130గా ఉన్న బీపీ ప్రస్తుతం 192కు చేరిందని, నవంబర్ 10న 193కు చేరిందని చెప్పారు. మెదడులో రక్తస్రావం, గుండెపోటు వచ్చే అవకావం ఉందని హెచ్చరించారు. తన గుండె కూడా ఇప్పటికే దెబ్బతిన్నట్లు వైద్యులు చెప్పినట్లు లేఖలో పేర్కొన్నారు. 74 ఏళ్ల వయసులో ఈ పరిస్థితులు తనను ప్రాణాలతో తిరిగి రాలేని స్థితికి చేర్చాయని ఇమ్రాన్ తన నిస్సహాయ స్థితిని లేఖలో వెల్లడించారు.
రోజుకు 22 గంటలు నిర్బంధంలోనే..
తనను రోజుకు 22 గంటల పాటు ఏకాంత నిర్బంధంలో ఉంచుతున్నారని ఇమ్రాన్ ఆరోపించారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, విదేశాల్లో ఉంటున్న తన కుమారులను కలిసేందుకు అనుమతించడం లేదని తెలిపారు. పుస్తకాలు చదవడానికి, టీవీ చూసేందుకు కూడా అవకాశం లేదని పేర్కొన్నారు. తన కంటి చూపు తీవ్రంగా దెబ్బతిన్నట్లు చెప్పారు. తన కుడి కంటి చూపు 85 శాతం వరకు తగ్గిపోయిందని చెప్పారు. ఆగస్టు 18న తనను రెండు రోజుల్లోగా షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించి, నిపుణులైన వైద్యులతో పరీక్షలు చేయించాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ అది అమలు కాలేదని ఇమ్రాన్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Imran Khan: ‘‘ప్రాణాలతో తిరిగి రాకపోవచ్చు’’.. నిస్సహాయ స్థితిలో ఇమ్రాన్ ఖాన్ లేఖ!
-
Love Story: అనిరుధ్ మామ కళానిధి మారన్ ప్రేమ కథ తెలుసా?
-
INDIA Bloc: ఎన్నికల సంఘానికి 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టులో INDIA కూటమి పిటిషన్!
-
Mouli: టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు దొంగ నా కొడుకు .. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ బ్యానర్లో మూడో సినిమా?
-
AP Elections: ముగిసిన 23 పట్టణ స్థానిక సంస్థల నామినేషన్ల పర్వం.. రేపు పరిశీలన..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!