Site icon NTV Telugu

Shahbaz Sharif: ఘోర అవమానాన్ని తట్టుకోలేని పాక్ ప్రధాని.. డోర్లు నెట్టిసి పుతిన్ గదిలోకి దూసుకెళ్లిన వైనం..

Sharif

Sharif

Shahbaz Sharif: తుర్క్‌మెనిస్తాన్ వేదికగా జరుగున్న ఓ కార్యక్రమంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు తీవ్ర అవమానం ఎదురైంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ జరగాల్సి ఉంది. అయితే, ఆ సమయంలో పుతిన్, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో క్లోజ్డ్ డోర్ మీటింగ్‌లో ఉన్నారు. సుమారు 40 నిమిషాలు వేచి చూసినా కూడా పుతిన్ పట్టించుకోలేదు. దీంతో సహనం కోల్పోయిన షహబాజ్ షరీఫ్ దౌత్యంపరంగా సిగ్గులేని పని చేశాడు.

Read Also: Pakistan: పాక్ యూనివర్సిటీలో సంస్కృతం, మహాభారతం.. మీరు వింటున్నది నిజమే..

పుతిన్, ఎర్డోగాన్ మీటింగ్ జరుగుతున్న సమావేశ హాలులోకి డోర్లు నెట్టేసి వెళ్లాడు. ఆ సమయంలో షరీఫ్ పూర్తిగా అసహనంతో ఉన్నాడని వైరల్ అవుతున్న వీడియోను చూస్తే తెలుస్తోంది. డోర్ వద్ద ఉన్న సెక్యూరిటీ ఆపేందుకు ప్రయత్నించినా కూడా పట్టించుకోకుండా లోపలికి వెళ్లాడు. సుమారు 10 నిమిషాల తర్వాత అక్కడ నుంచి నిష్క్రమించాడు. అయితే, ఈ సంఘటన అంతర్జాతీయంగా, దౌత్యపరంగా పాకిస్తాన్ పరిస్థితిని చూపిస్తోంది.

ఈ సంఘటనపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ సంఘటనను దౌత్యపరమైన తప్పుగా అభివర్ణించారు. మరో యూజర్ ‘‘ పుతిన్ బిచ్చగాళ్లతో సమయం వృధా చేయకూడదు’’ అని అన్నారు. ‘‘ట్రంప్ ఈ బిచ్చగాళ్లకు టైమ్ ఇచ్చారు’’ అని మరో యూజర్ వ్యాఖ్యానించారు. ‘‘40 నిమిషాల నిరీక్షణ తర్వాత జొమాటో డెలివరీ వ్యక్తి కూడా అక్కడ నుంచి వెళ్తారు. షరీఫ్ మాత్రం ఆ పని చేయలేదు’’ అని మరొకరు ఎద్దేవా చేశారు.

Exit mobile version