Shahbaz Sharif: తుర్క్‌మెనిస్తాన్ వేదికగా జరుగున్న ఓ కార్యక్రమంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు తీవ్ర అవమానం ఎదురైంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ జరగాల్సి ఉంది. అయితే, ఆ సమయంలో పుతిన్, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో క్లోజ్డ్ డోర్ మీటింగ్‌లో ఉన్నారు. సుమారు 40 నిమిషాలు వేచి చూసినా కూడా పుతిన్ పట్టించుకోలేదు. దీంతో సహనం కోల్పోయిన షహబాజ్ షరీఫ్ దౌత్యంపరంగా సిగ్గులేని పని చేశాడు.