Huge Tornado Destroys US Towns: అమెరికాను టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. వీటి ధాటికి పలు పట్టణాలు ధంసం అయ్యాయి. తీవ్రమైన గాలి, ఉరుములు, మెరుపులు, వర్షంతో టోర్నడోలు విరుచుకుపడటంతో మిసిసిపి చిగురుటాకులా వణికిపోయింది. ఇప్పటికే వీటి ధాటికి 25 మంది మణించారు. మరణాల సంఖ్య మరింగా పెరిగే అవకాశం ఉంది. అధ్యక్షుడు జో బైడెన్ అత్యవసర సహాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. మిసిసీపిలో హృదయవిదారక పరిస్థితులు ఉన్నాయని ఆయన అన్నారు.
గత కొద్ది రోజులుగా అగ్రరాజ్యం అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మిస్సిస్సిపిలో భారీ గాలులు, ఉరుములు కురుసిన వర్షాలకు 23 మంది మృతి చెందారు. టోర్నడోల ప్రభావంతో 100 మైళ్లకుపైగా నష్టం వాటిల్లింది.
Pilot Threatens To Crash Plane into Walmart in USA: అమెరికాలో ఓ పైలెట్ విమానాన్ని దొంగిలించి కూల్చేస్తానని బెదిరిస్తున్నాడు. అమెరికాలో పైలెట్ గా పనిచేస్తున్న ఓ యువకుడు భద్రతా అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. వాల్‌మార్ట్ పై విమానాన్ని కూలుస్తానంటూ ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. అమెరికాలోని ఈశాన్య మిస్సిస్సిప్పీలోని టుపెలోలోలోని వెస్ట్ మెయిన్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది.