Shutdown Threat: అధికార మార్పిడికి రెడీ అవుతున్న సమయంలో అమెరికాలో మరోసారి ఆర్థిక ప్రతిష్టంభన ఏర్పడింది. క్రిస్మస్ పండగ సమయంలో షట్‌డౌన్ ముప్పును తప్పించేందుకు యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ సర్కార్ తీసుకొచ్చిన ద్వైపాక్షిక ప్రణాళికను కాబోయే ప్రెసిడెంట్ ట్రంప్ తిరస్కరించారు. దీనిపై చర్చ జరిగేలా చూడాలని స్పీకర్ మైక్ జాన్సన్, రిపబ్లికన్ చట్ట సభ్యులకు అతడు కోరాడు. ఫెడరల్ ప్రభుత్వం దగ్గర నిధులు తరిగిపోతున్న సమయంలో.. ఈ ప్రణాళిక తీసుకు రావడం వల్ల కార్యకలాపాలు స్తంభించిపోయే ప్రమాదం ఉందన్నారు. అలాగే, బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిధుల ప్రణాళికలో ఖర్చులు భారీగా పెరిగిపోయాయని ఎలాన్ మాస్క్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. అయితే, ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసే వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మాస్క్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.
Read Also: Delhi: దేశ రాజధానిలో ఏడాది పాటు బాణాసంచా కాల్చడం నిషేధం
అయితే, ఎలాన్ మాస్క్ పోస్టు పెట్టిన కొద్ది సేపటికి డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ నేతలకు అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాలంటే ఈ ద్రవ్య వినిమయ బిల్లు శుక్రవారం (డిసెంబర్ 20)లోగా ఆమోదం పొందాల్సి ఉంది. డొనాల్డ్ ట్రంప్, జేడీ వాన్స్‌తో కలిసి ఓ సంయుక్త ప్రకటన రిలీజ్ చేశారు. రిపబ్లికన్లు చాలా తెలివైనవారు.. ఈ బిల్లును ఆమోదించొద్దని.. దీనిపై చర్చ చేపట్టాల్సిందేనని స్పీకర్ మైక్ జాన్సన్, ఇతర రిపబ్లికన్ చట్ట సభ్యులను కోరారు. దీంతో పాటు కొన్ని డిమాండ్లు తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ఇక, బిల్లుపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది.