ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్‌ని ఉద్దేశిస్తూ హమాస్ హెచ్చరికలు జారీ చేసింది. ఇలాగే సైనిక ఒత్తిడి కొనసాగిస్తే బందీలను ‘‘శవపేటికల్లో పంపిస్తాము’’ అని చెప్పారు. హమాస్ సాయుధ విభాగం ఎజెడిన్ అల్-కస్సామ్ బ్రిగేడ్స్ ప్రతినిధి అబూ ఒబెయిడా ఒక ప్రకటనలో వార్నింగ్ ఇచ్చారు.
Israel-Hamas War: గాజాలో బందీగా ఉన్న ఆరుగురు ఇజ్రాయిలీలను హమాస్ కాల్చి చంపడం యుద్ధంలో కీలక పరిణామంగా మారింది. గాజాలోని దక్షిణ ప్రాంతమైన రఫాలోని భూగర్భ సొరంగాల్లో ఈ ఆరుగురు మృతదేహాలను ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) కనుక్కున్నాయి. బందీలు చనిపోవడంపై ఇజ్రాయిల్‌లో తీవ్ర నిరసనలకు దారి తీశాయి. ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ లక్ష్యంగా వేలాది మంది టెల్ అవీవ్‌లో నిరసనలు చేశారు. బందీల విడుదల ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.