Heavy snow in Japan kills at least 17 injures dozens: జపాన్‌లో మంచు తుఫాన్ విధ్వంసం సృష్టిస్తోంది. ఈశాన్య జపాన్‌లో ఈ సీజన్‌లో సాధారణం కంటే మూడు రెట్లు ఎక్కువగా మంచు పడటంతో.. జపాన్ వాసులు వణికిపోతున్నారు. కొన్ని చోట్ల సంభవించిన ప్రమాదాల కారణంగా 17 మంది మృతి చెందగా.. 93 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. వేలాదిగా ఇళ్లు అంధకారంలోకి వెళ్లిపోయాయి. గత వారం రోజుల నుంచి ఈశాన్య ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తుండటంతో.. హైవేలపై వందలాది వాహనాలు నిలిచిపోయాయి. డెలివరీ సేవలూ ఆలస్యం అయ్యాయని అక్కడి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు వెల్లడించారు. కొందరు పైకప్పుల్లో పేరుకుపోయిన మంచును తొలగిస్తున్న క్రమంలో కిందకు పడి చనిపోయారని, మరికొంతమంది మంచులో కూరుకుపోయి మృతి చెందారని అధికారులు తెలిపారు. దీంతో.. మంచు తొలగిస్తున్న సమయంలో జాగ్రత్త వహించాలని, ఒంటరిగా ఆ పని చేయొద్దని మున్సిపల్ కార్యాలయాలు ప్రజల్ని సూచించాయి.
Twitter Data Leak: చరిత్రలో అతిపెద్ద డేటా లీక్.. అమ్మకానికి 40 కోట్ల మంది వివరాలు
టోక్యోకు ఉత్తరాన 300 కి.మీ దూరంలో ఉన్న యమగటా ప్రిఫెక్చర్‌లోని నాగై నగరంలో 80 సెం.మీ కంటే ఎక్కువ మంచు కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిందని అధికారులు పేర్కొన్నారు. యమగటా ప్రిఫెక్చర్‌లోని నాగాయ్ నగరంలో ఇంటి పైకప్పు నుంచి మంచు ఒక్కసారిగా పడటంతో, 70 ఏళ్ల మహిళ చనిపోయిందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తర జపాన్‌లోని భారీ మంచు ఒక ఎలక్ట్రిక్ పవర్ ట్రాన్స్‌మిషన్ టవర్‌ని పడగొట్టడంతో 20,000 ఇళ్లకు విద్యుత్ లేకుండా పోయిందని, అయితే ఆ తర్వాతి రోజే చాలా ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరించబడిందని ఆర్థిక & పరిశ్రమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆదివారం వరకు ఉత్తర జపాన్‌లో డజన్లకొద్దీ రైళ్లు, విమానాలు నిలిపివేయబడ్డాయి. అయితే.. ఆ సేవల్ని ఇప్పుడు తిరిగి ప్రారంభించామని రవాణా మంత్రిత్వ శాఖ పేర్కొంది. వరి సాగుకు పేరుగాంచిన నీగాటాలో.. కొత్త సంవత్సర వేడుకలకు తాము డెలివరీ చేసిన స్టిక్కీ రైస్ కేకేలు ఈ మంచు తుఫాన్ కారణంగా సకాలంలో కస్టమర్లకు చేరకపోవచ్చని తయారీదారులు చెప్పారు.
Volodymyr Zelenskyy: ఆ విషయంలో భారత్ భాగస్వామ్యం ఆశిస్తున్నా