ఎట్టకేలకు గాజాలో శాంతి పరిమళాలు వెదజల్లబోతున్నాయి. హమాస్-ఇజ్రాయెల్ మధ్య తొలి విడత శాంతి ఒప్పందం విజయవంతంగా కుదిరింది. ఇందులో భాగంగా సోమవారం ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేయనుంది. అలాగే పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టనుంది. ఇక బందీల విడుదల నేపథ్యంలో ట్రంప్ ఇజ్రాయెల్‌కు బయల్దేరి వెళ్లారు. అమెరికాలో విమానం ఎక్కుతూ గాజా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగిసిందని ప్రకటించారు. పశ్చిమాసియాలో సాధారణ పరిస్థితులు నెలకొనబోతున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Smriti Mandhana: తొలి బ్యాటర్‌గా స్మృతి మంధాన ప్రపంచ రికార్డు.. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలేదు!
దాదాపు రెండేళ్ల తర్వాత గాజా-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం నెలకొంది. సోమవారం బందీల విడుదల నేపథ్యంలో ట్రంప్ ఇజ్రాయెల్‌కు వచ్చారు. ఈరోజు ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రసంగించనున్నారు. అనంతరం బందీల కుటుంబ సభ్యులను కలవనున్నారు. అక్కడి నుంచి ఈజిప్ట్ వెళ్లనున్నారు. అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసీ నిర్వహిస్తున్న శాంతి శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన సంతకాల కార్యక్రమం ఉంటుంది. ఈ సదస్సుకు 20 దేశాల అధినేతలు, అంతర్జాతీయ ప్రముఖులు హాజరుకానున్నారు.
ఇది కూడా చదవండి: Rakul Preet : కత్తిలాంటి అందాలతో రకుల్ రచ్చ..
2023, అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1,200 మందిని చంపి.. 251 మందిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. మధ్యలో అంతర్జాతీయ మధ్యవర్తుల కారణంగా కొంత మంది బందీలను హమాస్ విడుదల చేసింది. ఒకేసారి అందరినీ విడిచిపెట్టాలని ఇజ్రాయెల్ ఒత్తిడి చేసింది. అందుకు ససేమిరా అనడంతో తిరిగి యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ట్రంప్ 20 పాయింట్ల ప్రణాళికను ప్రాతిపాదించారు. దీనికి హమాస్-ఇజ్రాయెల్ సూత్రప్రాయంగా అంగీకరించాయి. ఎట్టకేలకు ఈజిప్టు వేదికగా తొలి విడత జరిగిన చర్చలు విజయవంతంగా ముగియడంతో సోమవారం బందీలంతా ఒకేసారి విడుదల కానున్నారు. అలాగే ఇజ్రాయెల్ జైలు నుంచి పాలస్తీనా ఖైదీలంతా విడుదల కానున్నారు.
ఇది కూడా చదవండి: Shetty Balija Scholarships: పాలకొల్లులో నన్ను గెలిపించింది బీసీలు, ఎస్సీలే: మంత్రి నిమ్మల