Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
- హోర్ముజ్ జలసంధిపై ఆధారాన్ని తగ్గించేందుకు గల్ఫ్ దేశాల భారీ ప్రణాళికలు.
- యూఏఈ, ఇరాక్, సౌదీ కొత్త పైప్‌లైన్ ప్రాజెక్టులకు శ్రీకారం.
- కొత్త పోర్టు నిర్మాణంతో హోర్ముజ్‌కు బదులుగా మరో ఎగుమతి మార్గం.
- అయినప్పటికీ హోర్ముజ్ జలసంధి ప్రాధాన్యం పూర్తిగా తగ్గదని నిపుణుల అంచనా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oil Exports: అమెరికా-ఇరాన్ యుద్ధం గల్ఫ్ దేశాల ఆదాయానికి గండి కొడుతోంది. ప్రపంచంలో 20 శాతం ఇంధన అవసరాలకు కీలకంగా ఉన్న ఇరుకైన సముద్ర మార్గం ‘‘హార్ముజ జలసంధి’’లో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ఈ జలసంధిపై ఆధిపత్యం కోసం యూఎస్, ఇరాన్ పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హార్ముజ్‌పై ఆధారపడకుండా చమురు, గ్యాస్ సరఫరా చేసేందుకు కొత్త మార్గాలను ఇరాక్, యూఏఈ, సౌదీ అరేబియా అన్వేషిస్తున్నాయి.
పైప్ లైన్ల నిర్మాణం వేగవంతం:
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), ఇరాక్ ఇప్పటికే హార్ముజ్ జలసంధిని దాటకుండా తమ చమురును తరలించే భారీ పైప్ లైన్ ప్రాజెక్టును చేపట్టింది. సౌదీ అరేబియా కూడా ఇలాంటి ప్రాజెక్టు కోసం అధ్యయనం చేస్తోంది. మరోవైపు యూఏఈ కొత్త పోర్టు నిర్మాణానికి సిద్ధమువతోంది. గోల్డ్‌మన్ సాక్స్ విశ్లేషకురాలు అలెగ్జాండ్రా పాలస్ అంచనా ప్రకారం.. 2027 చివరి నాటికి గల్ఫ్ దేశాలు యుద్ధానికి ముందు ఎగుమతి చేసిన చమురులో దాదాపుగా 45 శాతాన్ని హార్ముజ్‌పై ఆధారపడకుండా ఎగుమతి చేసే సామర్థ్యాన్ని కలిగేలా గల్ఫ్ దేశాలు ప్లాన్ చేస్తున్నాయి.
Also Read
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
- China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
- Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
ఇదే విధంగా 2028 చివరి నాటికి రోజుకు 7.3 మిలియన్ బ్యారెళ్ల చమురును ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రవాణా చేసే అవకాశం ఉంది. దీంతో గల్ఫ్ దేశాలు తమ చమురు ఎగుమతుల్లో 60 శాతం వరకు హార్ముజ్‌పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
యూఏఈ వెస్ట్-ఈస్ట్ పైప్ లైన్:
యూఏఈ పశ్చిమ-తూర్పు పైప్‌లైన్ ప్రాజెక్టును చేపట్టింది, సగం పని కూడా పూర్తైంది. 2027 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అధికారులను ఆదేశించారు. 252 మైళ్ల పొడవైన ఈ పైప్‌లైన్ పూర్తయితే, ఫుజైరా పైప్ లైన్‌కు అనుసంధానమై రోజుకు 3.6 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ భూమార్గం ద్వారా ఎగుమతి చేసే సామర్థ్యాన్ని కల్పిస్తుంది.
ఇదే దారిలో ఇరాక్, సౌదీ:
యూఏఈ దారిలోనే ఇరాక్ , సౌదీ అరేబియాలు కూడా పైప్ లైన్ ప్రాజెక్టును ప్రారంభించాయి. ఇరాక్ 435 మైళ్ల బస్రా-హదీథా పైప్ లైన్ నిర్మాణాన్ని స్టార్ట్ చేసింది. ఇది భవిష్యత్తులో జోర్డాన్, సిరియా, టర్కీలతో అనుసంధానం అవుతాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా రోజుకు 2.5 మిలియన్ బ్యారెల్ల చమురు ఎగుమతి చేయవచ్చు. ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు $1.5 బిలియన్లు కేటాయించగా, మే నెలలో నిర్మాణం ప్రారంభమైంది.
ఇదిలా ఉంటే, సౌదీ అరేబియా కూడా తమ ఎగుమతి సామర్థ్యాన్ని పెంచే ప్రణాళికల్ని అధ్యయనం చేస్తోంది. ఎర్ర సముద్రానికి వెళ్లే తమ ముడి చమురు పైప్ లైన్ సామర్థ్యాన్ని రోజుకు 9 మిలియన్ బ్యారెళ్లకు పెంచేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, ఈ చర్చలు ప్రస్తుతానికి ప్రాథమిక దశల్లోనే ఉన్నాయి.
కొత్త ఓడరేవుకు శ్రీకారం:
పైప్ లైన్‌తో పాటు యూఏఈ అరేబియా సముద్ర తీరంలో హార్ముజ్ జలసంధికి వెలుపల కొత్త పోర్టు, కంటైనర్ టెర్మినల్ నిర్మించేందుకు యోచిస్తోంది. దీంతో హార్ముజ్ నుంచి ప్రయాణించకుండానే తమ సరకుల్ని రవాణా చేసే ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి వస్తుంది.
అయితే, ఇలాంటి ఎన్ని ప్రాజెక్టులు చేపట్టిన హార్ముజ్ జలసంధి పూర్తి ప్రాధాన్యత తగ్గదని విశ్లేషకులు చెబుతున్నారు. రోజుకు 7-9 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా ఇప్పటికీ ఈ జలమార్గంపైనే ఆధారపడుతుందని, కొన్ని కొత్త ఎగుమతి మార్గాలు ఎర్ర సముద్రంలోని స్థిరత్వం, భద్రతపై కూడా ఆధారపడుతాయని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో యెమెన్‌లోని ఇరాన్ మద్దతు కలిగిన హౌతీ తిరుగుబాటుదారులు యాక్టివ్‌గా ఉన్నారు. బాబ్ ఎల్ మాండెప్ జలసంధిపై దాడులు చేస్తామని వీరు బెదిరిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?