Greta Thunberg: హక్కుల కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్‌ని ఇజ్రాయిల్ బహిష్కరించింది. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఆమెకు ప్రాతినిథ్యం వహిస్తున్న హక్కుల సంఘం మంగళవారం ప్రకటించాయి. గాజాకు వెళ్లే ఓడను ఇజ్రాయిల్ స్వాధీనం చేసుకున్న ఒక రోజు తర్వాత ఈ పరిణామం జరిగింది. ‘‘గ్రెటా థన్‌బర్గ్ ఫ్రాన్స్‌కు విమానంలో ఇజ్రాయెల్ నుండి బయలుదేరుతోంది" అని ఎక్స్‌లో ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.