India-Canada Row: ఖలిస్తాన్ పేరేడ్‌పై భారత్ ఆగ్రహం.. హింసని వేడుకగా చేస్తున్నారని కెనడాపై ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Canada Row: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్-కెనడాల మధ్య దౌత్య సంబంధాల్లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. తాజాగా టొరంటోలోని మాల్టన్‌లో జరిగిన ఖలిస్తాన్ అనుకూల నగర్ కీర్తన్ పరేడ్‌పై భారత్, కెనడాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కెనడా తీవ్రవాద అంశాలకు చోటు కల్పిస్తోందని మండిపడింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటనలో.. ‘‘కెనడాలోని తీవ్రవాద అంశాలు మా రాజకీయ నాయకత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక చిత్రాలను ఉపయోగిస్తున్నారు. మేము పదేపదే మా ఆందోనలను లేవనెత్తాము. గత ఏడాది ఖలిస్తాన్ మాజీ ప్రధాని హత్యకు సంబంధించిన పోస్టర్ ప్రదర్శించారు’’ అని పేర్కొన్నారు. క్రిమినల్, వేర్పాటువాద అంశాలకు కెనడాని సురక్షితమైన స్వర్గధామంగా మార్చడం ఆపాలని కెనడా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నామని ప్రకటన పేర్కొంది.
Read Also: PM Modi: బీజేపీకి 400 సీట్లు ఎందుకు కావాలంటే..? వివరించిన పీఎం మోడీ..
Also Read
హింసను వేడకగా జరుపుకోవడం, కీర్తించడం ఏ నాగరిక సమాజంలో కూడా భాగం కాదు. చట్టబద్ధమైన పాలనను గౌరవించే ప్రజాస్వామ్య దేశాలు భావప్రకటన స్వేచ్ఛ పేరుతో తీవ్రవాద శక్తుల ద్వారా బెదిరింపులకు అనుమతించకూడదని జైశ్వాల్ అన్నారు. కెనడాలో మా దౌత్య ప్రతినిధుల భద్రత గురించి మేము ఆందోళన చెందుతున్నామని, వారు తమ బాధ్యతలను నిర్భయంగా నిర్వర్తించగలరని కెనడా ప్రభుత్వం నిర్ధారిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. టొరంటోలో అంటారియో గురుద్వారా కమిటి ఈ ఖలిస్తాన్ అనుకూల పరేడ్ నిర్వహించింది. భారత రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా నినాదలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీని జైలులో ఉంచినట్లు ఓ ఫోటోను ప్రదర్శించారు. 6 కిలోమీటర్ల పాటు సాగిన ఈ పరేడ్‌లో భారత వ్యతిరేక ఉగ్రవాదులుగా గుర్తించబడిన పరమ్ జిత్ మాండ్, అవతార్ సింగ్ పన్నూ వంటి వ్యక్తులు ఖలిస్తాన్ అనుకూల ప్రసంగాలు చేశారు.
తాజావార్తలు
-
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ శుభ వార్తలే.. నేడు డబ్బే డబ్బు!
-
Cargo Ship Sinks in Bay of Bengal: బంగాళాఖాతంలో ఘోర ప్రమాదం.. 24 మంది సిబ్బందితో సరుకు నౌక మునక
-
Jason Sanjay: విజయ్ బాటలో జాసన్ సంజయ్.. నటుడిగా ఎంట్రీపై ఫస్ట్ టైమ్ క్లారిటీ!
-
Double-Stack Container Train: భారతీయ రైల్వే చరిత్రలో కీలక మైలురాయి.. తొలిసారి డబుల్ స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!