Gaza: గాజాలో దుర్భర పరిస్థితులు.. 109 వాహనాల్లో ఆహార పదార్థాలు లూటీ!
- గాజాలో దుర్భర పరిస్థితులు
- 109 వాహనాల్లో ఆహార పదార్థాలు లూటీ!
- పూర్తిగా దెబ్బతిన్న లా అండ్ ఆర్డర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాజాలో పరిస్థితులు అత్యంత ఘోరంగా తయారయ్యాయి. గతేడాది ప్రారంభమైన యుద్ధంతో గాజా పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ఆహార కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీస అవసరాలు తీరక నరకయాతన పడుతున్నారు. కొద్దిరోజులైతే స్వచ్ఛంద సంస్థలు పంపిణీ చేసే ఆహార వసతులు కూడా నిలిచిపోయాయి. దీంతో అత్యంత దుర్భరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే తాజాగా గాజాకు వెళ్లే రహదారులను ఇజ్రాయెల్ ఓపెన్ చేసింది. దీంతో స్వచ్ఛంద సంస్థలు ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. అయితే ఆహార సామగ్రిని తీసుకెళ్తున్న ట్రక్కులను కొందరు దుండగులు ఎత్తుకెళ్లిపోయారు. హింసకు పాల్పడి లూటీ చేశారు. ఇలా మొత్తం 109 ట్రక్కుల్లోని ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లిపోయారు. డ్రైవర్లపై తుపాకీ ఎక్కుపెట్టి 97 ట్రక్కుల్లోని సరకును కాజేశారని యూఎన్ఆర్డబ్ల్యూఏ పేర్కొంది. శనివారం జరిగిన దాడిలో సహాయ సిబ్బందికి కూడా గాయాలయ్యాయని, ట్రక్కులు దెబ్బతిన్నాయని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Fire Accident In Hotel: క్రికెటర్స్ ఉన్న హోటల్లో భారీ అగ్నిప్రమాదం
Also Read
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
గాజాలో శాంతిభద్రతలు పూర్తిగా విచ్ఛిన్నమయ్యాయని ఐక్యరాజ్యసమితి గతంలోనే హెచ్చరించింది. కాన్వాయ్‌లకు ఎలాంటి రక్షణ లేకుండా పోయిందని… ఇజ్రాయెల్ అధికారులు చట్టపరమైన బాధ్యతలను విస్మరిస్తున్నారంటూ తీవ్రంగా స్పందించింది. తక్షణ చర్యలు చేపట్టకపోతే.. గాజాలో తీవ్ర ఆహార కొరత ఏర్పడుతుందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలో పనిచేస్తోన్న యూఎన్ఆర్డబ్ల్యూఏ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ.. ఒక సంచి పిండి కోసం ప్రజలు కొట్టుకునే పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 10 లక్షల మంది ఆకలితో మరణించే ప్రమాదం ఉందని ఇప్పటికే వరల్డ్ ఫుడ్ ప్రొగ్రామ్ హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: RBI: డీప్‌ఫేక్ వీడియోలపై ఆర్బీఐ వార్నింగ్.. ఇన్వెస్టర్లు నమ్మొద్దని సూచన

తాజావార్తలు
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
-
AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్‌తో బాస్ ఎంట్రీ?
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!