Titan: ఒడ్డుకు చేరిన టైటాన్ శకలాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Titan: టైటానిక్ షిప్ శిధిలాలను చూడటానికి వెళ్లిన టైటాన్ జలాంతర్గామి పేలిపోయిన విషయం తెలిసిందే. అందులో ప్రయాణించిన 5 మంది మరణించిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు టైటాన్‌కు చెందిన శకలాలను అట్లాంటిక్ మహాసముద్రం అడుగు భాగం నుంచి ఒడ్డుకు చేర్చారు. కెనడాలోని సెయింట్ జోన్స్‌లో హారిజాన్ ఆర్కిటిక్ షిప్లో ఈ లోహ శకలాలను ఒడ్డుకు చేర్చినట్టు అధికారులు చెబుతున్నారు. టైటాన్ సబ్‌కు చెందిన లోహ శకలాలు టార్పాలిన్లతో కప్పి ఉండగా వాటిని క్రేన్లతో ట్రక్‌లోకి మార్చారు. టైటాన్ సబ్‌కు చెందిన ల్యాండింగ్ ఫ్రేమ్, వెనుక కవర్ దొరికాయని అమెరికా కోస్ట్ గార్డ్ అధికారులు చెప్పారు. టైటాన్‌కి చెందిన అయిదు భాగాలు టైటానిక్ నౌక ముందు భాగానికి 487 మీటర్ల దూరంలో లభించినట్లు కోస్ట్ గార్డ్ రేర్ అడ్మిరల్ జాన్ మౌగర్ చెప్పారు.
Read also: Attack on US Consulate: యూఎస్ కాన్సులేట్‌పై దాడి.. కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు సహా ఇద్దరు మృతి
Also Read
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
మునిగిపోయిన టైటానిక్ షిప్ శిథిలాలు చూడ్డానికి అయిదుగురితో అట్లాంటిక్ మహా సముద్ర అడుగు భాగానికి వెళ్లే క్రమంలో టైటాన్ సబ్మెర్సిబుల్ పేలిపోయిన విషయం తెలిసిందే. సముద్రం అడుగున్న ఉన్న టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు ఓషన్ గేట్ సీఈఓ 61 ఏళ్ల స్టాక్టన్ రష్, 48 ఏళ్ల బ్రిటిష్ పాకిస్తానీ వ్యాపారవేత్త షహజాదా దావూద్, 19 ఏళ్ల ఆయన కొడుకు సులేమాన్, 58 ఏళ్ల బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ఫ్రాన్స్‌కు చెందిన 77 ఏళ్ల హెన్రీ నార్గొలెట్ ఇందులో వెళ్లారు. వెళ్లిన కొద్దిసేపటికే జలాంతర్గామీ పేలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఉలాంతర్గామిలో ప్రయాణించిన అయిదుగురూ ప్రాణాలు కోల్పోయారు. టైటాన్‌తో సంబంధాలు తెగిపోయిన తర్వాత దాని రెస్క్యూ ఆపరేషన్‌లో ఉన్న అమెరికా కోస్ట్ గార్డ్ సిబ్బందికి అది పేలిపోయినట్లు భారీ శబ్దం వినిపించింది. ఆ తరువాత టైటాన్‌ను కనుగొనడానికి కోస్ట్ గార్డ్ అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే 5 రోజుల రెస్క్యూ ఆపరేషన్ అనంతరం టైటాన్ జలాంతర్గామి పేలిపోయినట్టు అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించిన శకలాలను ఇప్పుడు అధికారులు గుర్తించి ఒడ్డుకు చేర్చారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!