Guinnis Record: ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వినోదానికి పెద్ద పీట వేస్తున్నారు. అందుకే ప్రజల అభిరుచి తగిన విధంగా పార్కుల్లో నిర్వాహకులు అడ్వంచెర్ రైడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. వాటర్ స్లైడ్స్ నుండి డ్రాప్ టవర్ల వరకు ప్రజలు ఈ రైడ్లను ఆస్వాదిస్తున్నారు. ఈ రైడ్లలో సాహసోపేతమైన రోలర్ కోస్టర్ కచ్చితంగా ఉంటుంది. ఈ థ్రిల్లింగ్ రైడ్‌ని ప్రయత్నించడానికి చాలా మంది భయపడుతుండగా, చాలా మంది ప్రజలు రోలర్ కోస్టర్ వేగానికి ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో దుబాయ్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 17న ప్రారంభించిన రోలర్ కోస్టర్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వర్టికల్ లాంచ్ రోలర్ కోస్టర్‌గా గిన్నిస్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది.
Read Also: Vijayawada to Sharjah: విజయవాడ నుంచి నేరుగా షార్జాకి విమానం
దుబాయ్‌లోని హిల్స్ మాల్లో ఏర్పాటు చేసిన ఈ రోలర్ కోస్టర్ గంటకు 41 కిలోమీటర్లు వేగంతో 670 మీటర్ల ట్రాక్‌ను భవనం చుట్టూ మలుపులు తిరుగుతూ నిలువుగా ఆకాశంలోకి వెళ్తుంది. దీంతో ఈ రోలర్ కోస్టర్ ఎక్కిన ప్రజలు ఆశ్చర్యానికి గురవుతూ రైడ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. కాగా ఈ రోలర్ కోస్టర్ దుబాయ్ పర్యాటకాన్ని మరింత ప్రజల్లోకి తీసుకువెళ్లిందని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. ఈ రోలర్ కోస్టర్ గిన్నిస్ రికార్డుల్లో ఎక్కినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. అటు ఈ గిన్నిస్ రికార్డును ప్రజలకు తెలిపేందుకు బుర్జ్ ఖలీఫాపై దీనిని ప్రసారం చేశారు. ఈ సందర్భంగా బుర్జ్ ఖలీఫా సంబరాలతో నిండిపోయింది.