Aditi Shankar: సాధారణంగా ఏ రంగంలోనైనా పరంపర అనేది ఉంటుంది. అంటే తరతరాలుగా ఒక వ్యాపారాన్ని అదే కుటుంబంలో వారు చేయడం. దాన్నే వంశంపారంపర్యంగా వస్తున్న వృత్తి అని అంటారు. అయితే ఇంగ్లీషులో దాన్ని నెపోటిజం అంటారు. ఇండస్ట్రీలో ఎక్కువగా ఈ మాటను ఉపయోగిస్తారు. హీరో పిల్లలు, డైరెక్టర్ పిల్లలు.. ప్రొడ్యూసర్ పిల్లలు.. ఇలా తమ తమ పిల్లలందరూ సినిమా రంగంలోనే సెటిల్ అవ్వాలని చూస్తూ ఉంటారు. కానీ ఒక స్టార్ డైరెక్టర్ మాత్రం తన కూతురుకు ఇండస్ట్రీ వద్దని చెప్పాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు లెజెండరీ డైరెక్టర్ శంకర్ .ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను ఇండస్ట్రీకి అందించిన శంకర్ తన కూతురు అదితి శంకర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయడం ఇష్టం లేదట. కానీ అదితికి మాత్రం హీరోయిన్ అవ్వాలని ఉండడంతో ఆమె తండ్రిని ఒప్పించి హీరోయిన్ గా మారింది.
Mahesh Babu: మహేష్ బాబు గురించి ఈ ఐదు విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..?
కార్తీ జంటగా విరుమాన్ చిత్రంతో అదితి ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న అదితి రెండో సినిమానే శివ కార్తికేయన్ తో నటించే ఛాన్స్ ని పట్టేసింది. మహావీరుడు సినిమాలో శివ కార్తికేయన్ తో నటించి మెప్పించింది. ఈ సినిమా సైతం తమిళ్లో మంచి హిట్ బు అందుకోవడంతో అమ్మడు వరుస అవకాశాలను అందుకుంటుంది. కొంచెం కూడా గ్యాప్ లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తుంది. అయితే గ్యాప్ లేకుండా సినిమాలు చేయడానికి అది కారణం ఉందట. అది తండ్రి శంకర్ పెట్టిన ఒక కండిషన్ అని తెలుస్తుంది. కూతురు హీరోయిన్ అవుతాను అంటే.. శంకర్ ఒక కండీషన్ పెట్టాడట. ” నీకు రెండేళ్లు మాత్రమే ఛాన్స్ ఇస్తాను. ఆ రెండేళ్లలో ఎన్ని సినిమాలు అయినా చేసుకో.. రెండేళ్లు పూర్తి అయ్యాక మాత్రం ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి” అని చెప్పారట. అందుకు అదితి ఒప్పుకోవడంతోనే ఆయన కెమెరా ముందుకు వెళ్లనిచ్చారట. ఈ విషయం తెలియడంతో కొందరు శంకర్ ను అభినందిస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. కూతురుకు కండీషన్స్ పెట్టడం ఏంటి శంకర్ సర్ అని కొందరు అంటుండగా.. మంచి పని చేశారు. ఇండస్ట్రీ గురించి తెలిసిన వారు కాబట్టి ఇలా చేశారు అని ఇంకొందరు అంటున్నారు. మరి ఈ రెండేళ్లలో ఈ భామ ఎన్ని సినిమాలు చేస్తుందో చూడాలి.