Donald Trump:వాణిజ్య ఒప్పందంలో భాగంగా అమెరికా, చైనాల మధ్య ముందస్తుగా రేర్ ఎర్త్ మెటీరియల్, చైనా విద్యార్థులకు వీసాలపై డీల్ పూర్తయినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించారు. ట్రూత్ సోషల్ పోస్టులో.. బీజింగ్ అమెరికాకు అయస్కాంతాలు, కావాల్సిన రేర్ ఎర్త్ మెటీరియల్స్ సరఫరా చేస్తుందని, బదులుగా అమెరికా చైనీస్ స్టూడెంట్స్‌కి యూఎస్ కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుకోవడానికి అనుమతిస్తుందని చెప్పారు.
ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దేశాలైన అమెరికా, చైనాల మధ్య చాలా కాలంగా ఉద్రిక్తత నెలకొంది. ఇరు దేశాలు పరస్పరం కంపెనీలపై అనేక ఆంక్షలు విధించుకున్నాయి. దాదాపు మూడు దశాబ్దాలుగా చైనా ప్రపంచ కర్మాగారంగా ఉంది.