ఈ రోజుల్లో ఎప్పుడు ఎవరు కలిసి ఉంటారో, ఎప్పుడు విడిపోతారో తెలియదు. పాశ్ఛాత్య దేశాల్లో విడిపోవడం, విడాకులు తీసుకోవడం కామన్ అయింది. కొన్ని దేశాల్లో విడాకులు తీసుకోవడం కొంత కష్టమైన అంశం కావొచ్చు. అయితే, ప్రపంచంలో విడాకుల చట్టం లేని దేశం ఒకటి ఉంది. ఆ దేశంలో విడాకులు తీసుకోవడం అస్సలు కుదరని పని. ఎందుకంటే ఆ దేశ చట్టాల్లో విడాకుల చట్టం లేదు. ప్రజలు ఎన్ని కష్టాలు వచ్చినా కలిసి ఉండేందుకే ప్రయత్నిస్తారు తప్పించి విడిపోవాలని కోరుకోరు. ఒకవేళ విడిపోయి జీవనం సాగిస్తే అక్కడి ప్రజలు వారిని దారుణంగా చూస్తుంటారు. అంతేకాదు, విడిపోయి జీవించడం అగౌరవంగా భావిస్తారు అక్కడి ప్రజలు. ఇన్ని విచిత్రాలున్నా ఆ దేశం పేరు ఫిలిప్పిన్స్.
Read: ‘డియర్ మేఘా’ గుండెల్లో కన్నీటి మేఘం.. లిరికల్ వీడియో
ఆసియా ఖండంలోని ఫిలిప్పిన్స్లో ఎక్కువమంది క్యాథలిక్ మతస్తులు నివశిస్తుంటారు. ఈ దేశం మొదట స్పెయిన్ ఆదీనంలో ఉండేది. ఆ సమయంలో ప్రజలు క్యాథెలిక్ మతాన్ని స్వీకరించారు. అప్పటి నుంచి ఆ మతవిశ్వాసాలు పూర్తిగా జీర్ణంచేసుకున్నారు. విడిపోవడం అగౌరవంగా కలిసి ఉండటం గౌరవానికి ప్రతీకగా చూస్తుంటారు. అయితే, 1898లో స్పానిష్ యుద్దంలో అమెరికా గెలుపొంది ఫిలిప్పిన్స్ దేశాన్ని ఆక్రమించుకుంది. అమెరికా కొన్ని చట్టాలను తెచ్చింది. విడాకుల చట్టం తీసుకొచ్చింది. కానీ ఆ దేశ ప్రజలు అందుకు అంగీకరించలేదు. ఆ తరువాత జపాన్ ఆ దేశాన్ని ఆక్రమించుకొని అమెరికా తెచ్చిన చట్టాలను రద్దు చేసింది. రెండు ప్రపంచ యుద్దం సమయంలో అమెరికా తిరిగి ఫిలిప్పిన్స్ను స్వాధీనం చేసుకొని చట్టాలను పునరుద్దరించింది. అయితే, 1946లో అమెరికా నుంచి స్వాతంత్రం పొందిన ఫిలిప్పిన్స్ తమ చట్టాల్లో విడాకుల చట్టం లేకుండా చేసింది.