Deadly shooting at Hamburg Jehovah Witness hall: జర్మనీ హాంబర్గ్‌లోని ఒక చర్చిలో గురువారం రాత్రి కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురు మరణించగా.. కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎంతమంది మృతి చెందారనే విషయంపై పోలీసులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు కానీ.. స్థానిక మీడియా ప్రకారం ఏడుగురు మృతి చెందారని, మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. మూడు అంతస్తుల భవనమైన హాంబర్గ్ యెహోవా విట్‌నెస్ సెంటర్‌లో ఈ కాల్పులు జరిగాయి. ఈ నరమేధానికి పాల్పడింది ఎవరు? దీని వెనుక గల కారణాలు ఏంటి? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో.. స్థానికులు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
Tamilnadu Crime: టీ పెట్టిన చిచ్చు.. వేడిగా లేదన్న పాపానికి, కోడలి కిరాతకం
తొలుత గుర్తు తెలియని వ్యక్తి రాత్రి 8:15 గంటలకు ఓ విపత్తు హెచ్చరిక యాప్ ద్వారా.. మొదటి ఫ్లోర్ నుంచి తుపాకీ శబ్దం వినిపించిందంటూ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో.. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, ఆ భవనాన్ని చుట్టుముట్టారు. అనంతరం లోపలికి వెళ్లి చూడగా.. కింది ఫ్లోర్‌లో కొందరు రక్తపు మడుగుల్లో చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని గమనించారు. వారిలో కొందరు అప్పటికే ప్రాణం కోల్పోగా, మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయాలైన వారిని పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పైఫ్లోర్‌లోనూ ఒక వ్యక్తి మృతదేహం పోలీసులకు లభ్యమైంది. బహుశా ఆ వ్యక్తే ఈ కాల్పులకు పాల్పడి ఉంటాడని, ఈ నరమేధం సృష్టించిన తర్వాత అతడు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. కాల్పులకు పాల్పడింది అతడేనా? లేక మరెవరైనా ఈ దారుణానికి పాల్పడి పరారయ్యాడా? అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు హై అలర్ట్ జారీ చేసిన పోలీసులు.. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారం అందించాలని కోరారు.
Rajasthan No Beard Culture: మీకు గడ్డం ఉందా.. అయితే మీరు పెళ్లికి అర్హులు కారు
ఇదిలావుండగా.. కొన్ని సంవత్సరాల నుంచి జిహాదీలు, స్థానిక అతివాద గ్రూపులు జర్మనీపై దాడులు జరుపుతున్నాయి. 2016 డిసెంబర్‌లో బెర్లిన్‌లోని ఓ క్రిస్మస్ మార్కెట్‌లో ఇస్లామిస్ట్ తీవ్రవాదులు చేసిన దాడిలో 12 మంది మృతి చెందారు. ఫిబ్రవరి 2020లో హనౌ నగరంలో అతివాద సంస్థ వ్యక్తి ఒకడు కాల్పులు జరపగా.. పది మంది దుర్మరణం చెందారు. 2019లో హాలీలోని ఓ ప్రార్థనా మందిరంపై కూడా దాడి చేయడానికి ప్రయత్నించారు. బహుశా.. ఇప్పుడు చర్చిలో జరిగిన దాడుల వెనుక కూడా జిహాదీల హస్తం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Bride Cancel Marriage: కట్నం సరిపోలేదని.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వధువు