Tamilnadu Crime: టీ పెట్టిన చిచ్చు.. వేడిగా లేదన్న పాపానికి, కోడలి కిరాతకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TN Woman Lills Mother-In-Law During Argument Over Tea Not Being Hot Enough: అత్తాకోడళ్ల మధ్య సాధారణంగానే సఖ్యత ఉండదు. ప్రతి చిన్న విషయంలోనూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుంటాయి. అందరూ అలా కాకపోయినా, చాలామంది అత్తాకోడళ్ల మధ్య మాత్రం విభేదాలు తప్పకుండా ఉంటాయి. కొన్నిసార్లు అవి ముదిరి.. కుటుంబాలే విడిపోయేదాకా వ్యవహారాలు వెళ్తాయి. అయితే.. ఇక్కడ ఓ కోడలు మాత్రం అంతకుమించిన దారుణానికి పాల్పడింది. కేవలం టీ వేడిగా లేదన్న పాపానికి.. రాడ్ తీసుకొని తల బద్దలుకొట్టింది. దీంతో.. ఆ అత్త ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ చివరికి మృతిచెందింది. తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
Shocking news: గర్భం అనుకుని హాస్పిటల్‌కు వెళ్తే.. షాకింగ్ న్యూస్ చెప్పిన డాక్టర్
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
పుదుక్కొట్టై జిల్లాలోని మలైక్కుడిపట్టిలో వేల్, పళనియమ్మాళ్ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, సుబ్రమణ్యన్ అనే కుమారుడు ఉన్నారు. సుబ్రమణ్యన్‌కి గనకు అనే యువతికి ఇచ్చి పెళ్లి చేశారు. భర్త లేకపోవడంతో పళినియమ్మాళ్ తన కొడుకు, కోడలి వద్దే ఉంటోంది. పెళ్లైన కొత్తలో అత్తాకోడళ్ల మధ్య బాగానే ఉండేది కానీ, రానురాను వారి బంధం చెడింది. తరచూ గొడవలు జరగడం మొదలైంది. ప్రతీ చిన్న విషయంలోనూ ‘నువ్వా-నేనా’ అన్నట్టు గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి బయటకు వెళ్లి ఇంటికొచ్చిన పళనియమ్మాళ్.. కోడలిని పిలిచి తన కోసం టీ పెట్టాలని కోరింది. అయిష్టంగానే కోడలు టీ పెట్టి ఇచ్చింది. అయితే.. టీ చల్లారిపోవడంతో కోడల్ని అత్త మందలించింది.
Pralhad Joshi: కరెంట్ కోతల వల్లే జనాభా పెరిగింది.. కేంద్రమంత్రి వింత ప్రకటన
దీంతో ఆ ఇద్దరి మధ్య మళ్లీ మాటామాట పెరిగి, గొడవ ముదిరింది. ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహానికి గురైన గనకు.. ఇంట్లో ఉన్న ఇనుపరాడ్డు తీసుకొని అత్త తలపై బాదింది. ఈ ఘటనలో పళనియమ్మాళ్ తీవ్రంగా గాయపడింది. ఆమెను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆమె ప్రాణాలు వదిలినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పళనియమ్మాళ్, కనుకు మొదటి నుంచే సఖ్యత లేదని స్థానికులు చెప్తున్నారు. పళనియమ్మాళ్ చాలాకాలం నుంచి మానసిక వ్యాధితో బాధపడుతోందని, అందుకు చికిత్స కూడా తీసుకుంటోందని తెలిపారు.
తాజావార్తలు
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..