ప్రపంచంలో మార్పులు వేగంగా జరుగుతున్నాయి. వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. చలి తీవ్రత ఉండే ప్రాంతాల్లో వేడి గాలులు వీస్తుండటంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు, ధృవప్రాంతాల్లోని మంచు ఫలకాలు వేడి గాలులకు కరిగిపోతున్నాయి. ఫలితంగా సముద్రంలోకి నీరు అధికంగా చేరుతున్నది. ఇక గ్రీన్‌లాండ్‌లోని మంచు వేగంగా కరుగుతుండటంపై పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతంలో వారం రోజుల వ్యవధిలో కరిగిన మంచు అమెరికా రాష్ట్రంలోని ఫ్లోరిడాను 2 అంగుళాల నీటిలో ముంచేయ్యగలదని పర్యావరణ…