Sri Lanka Crisis: శ్రీలంక సర్కార్ కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో రెండు నెల క్రితం రోడ్లెక్కిన జనం.. ఆందోళనలు ఉధృతం చేశారు. నిరసనలు కాస్త హింసాత్మకంగా మారాయి. దీంతో ఎమర్జెన్సీ విధించిన శ్రీలంక ప్రభుత్వం.. తరువాత సడలించింది. మళ్లీ మే 6 నుంచి చేపట్టిన నిరనసలు విధ్వంసానికి దారి తీయడంతో.. రెండోసారి అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఆ తరువాత మహింద రాజపక్స రాజీనామా చేయడం, కొత్త ప్రధానిగా రణిల్ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టడం జరిగిపోయాయి. ఇదే సమయంలో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టడంతో… తాజాగా ఎమర్జెన్సీని ఎత్తివేసింది లంక ప్రభుత్వం. దీంతో అక్కడి ప్రజలకు ఇబ్బందులు తప్పనున్నాయి.
Read Also: Nara Lokesh: కోర్టుకు హాజరైన నారా లోకేష్.. ఉద్రిక్తత..!
Also Read
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
- Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
మరోవైపు లంకలో ఆర్థిక సంక్షోభం, ఆహార కొరతతో జనం ఇబ్బందులు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆహారం దొరక్క ఆకలి చావులు చోటు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ కొరతతో దేశంలో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. అటు ఆందోళనలు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలో ఆర్థిక సంక్షోభానికి రాజపక్స కుటుంబమే కారణమని.. అధ్యక్షుడు గొటబయ రాజపక్స రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక, శ్రీలంకకు ఎన్నో విధాలుగా సాయం అందిస్తున్న భారత్ మరో.. 40 వేల టన్నుల డీజిల్ సరఫరా చేసింది. అలాగే బియ్యం, ఔషధాలు, పాలపొడి ఉత్పత్తులతో బయలుదేరిన నౌక.. శ్రీలంకకు చేరింది. భారత్‌తో పాటు జపాన్ కూడా 1.5 మిలియన్ డాలర్ల విలువైన అత్యవసర సాయాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా ఫోర్టిఫైడ్ బియ్యం, పప్పులు, నూనె వంటివాటిని లంకకు పంపించనున్నట్లు తెలిపింది జపాన్.
తాజావార్తలు
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!