శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో రెండు నెల క్రితం రోడ్లెక్కిన జనం.. ఆందోళనలు ఉధృతం చేశారు. నిరసనలు కాస్త హింసాత్మకంగా మారాయి. దీంతో ఎమర్జెన్సీ విధించిన శ్రీలంక ప్రభుత్వం.. తరువాత సడలించింది. మళ్లీ మే 6 నుంచి చేపట్టిన నిరనసలు విధ్వంసానికి దారి తీయడంతో.. రెండోసారి అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఆ తరువాత మహింద రాజపక్స రాజీనామా చేయడం, కొత్త ప్రధానిగా రణిల్ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టడం జరిగిపోయాయి. ఇదే సమయంలో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టడంతో……