ఈ భూప్రపంచంలో కన్న తల్లి కన్నా గొప్పవారు ఉండరు.. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించినట్లు చెబుతున్నారు.. అమ్మ ఆ దేవం కంటే గొప్పది. నవమాసాలు తన కడుపులో మోసి.. జన్మనిచ్చి పెంచిపెద్దను చేస్తుంది.. తన పిల్లలకు ఎలాంటి హానీ కలగకుండా చూసుకుంటుంది.. ఏదైనా కష్టం వస్తే తన ప్రాణాలను కూడా అడ్డువేసి బిడ్డను కాపాడుకుంటుంది.. కానీ, ఈ తల్లి మాత్రం మాతృత్వానికే మాయని మచ్చను తెచ్చిపెట్టింది. ఇంతకంటే పెద్ద పదం ఉపయోగించినా తప్పులేదు. ఎందుకంటే.. తన కొడుకు చంపేసి, వండుకుని తినేసింది ఆ తల్లి. ఈ భయానక ఘటన ఈజీప్ట్ లో వెలుగుచూసింది..
వివరాల్లోకి వెళితే.. ఈజిప్ట్ లోని ఫకస్ లో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది.. హనా మహ్మద్ హసన్ తన భర్త నుంచి విడాకులు తీసుకుని.. 5 ఏళ్ల కొడుకు యూసుఫ్‌తో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. హనా మానసిక రుగ్మతలతో బాధపడుతోంది. ఈ క్రమంలోనే.. హనా.. తన కుమారుడు యూసుఫ్‌ను కత్తితో పొడిచి చంపేసింది.. ఇక ఆ తర్వాత తలను ముక్కలు ముక్కలు చేసింది వేడి నీటిలో ఉడకపెట్టి కూర చేసుకొని తినేసింది.. కుమారుడని హత్య చేసిన తరువాత మహిళ ఆ చిన్నారి మృతదేహాన్ని నీటిలో పెట్టింది. అయితే, ఇంటి పక్కనే ఉంటున్న బంధువు కొడుకు ఇంటికి రాగా.. యూసుఫ్ కనిపించలేదు. బుక్‌లో మృతదేహానికి సంబంధించిన కొన్ని ముక్కలు కనిపించాయి.
అతను వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపాడు.. వారు వచ్చి దీనిపై గట్టిగా అడగడంతో విచారణలో షాకింగ్ వివరాలను వెల్లడించింది. కుమారుడి తల భాగం ఎక్కడుందని ప్రశ్నించగా.. తినేసినట్లు చెప్పింది.. హనా మాజీ భర్త తన కుటుంబ సభ్యులందరితో కలిసి జీవిద్దామని కోరాడు. అయితే, అందకు హనా అంగీకరించలేదు. పైగా మానసిక సమస్యలతో ఇబ్బంది పడేది. భర్త ఎంత చెప్పిన వినకుండా కొడుకును తీసుకుని వెళ్లిపోయింది హనా తన భర్త మాట వినకుండా ఇలా చెయ్యడం పై కొడుకును చంపినట్లు హనా భర్త తెలిపాడు..