Elon Musk vs Trump: మరికొన్ని రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఇప్పటికే ఆయన తన టీమ్‌ని దాదాపుగా ఖరారు చేశారు. ట్రంప్ తన పాలనలో ఎలాన్ మస్క్‌తో పాటు భారతీ సంతతికి చెందిన వివేక్ రామస్వామికి పెద్ద పీట వేశారు. అయితే, ఇప్పుడు ట్రంప్, మస్క్ మద్దతుదారుల మధ్య పొసగడం లేదని తెలుస్తోంది. దీనికి కారణం.. భారతీయ వలసదారులే. మస్క్‌తో పాటు సిలికాన్ వ్యాలీకి చెందిన దిగ్గజ సంస్థలు మెరిట్ ఆధారిత వలస సంస్కరణలకు పిలుపునిస్తున్నారు. మరోవైపు ట్రంప్ మద్దతుదారులు ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక వైఖరికి కట్టుబడి ఉన్నారు.
ట్రంప్ పరిపానలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) విధానానికి భారతీయ సంతతికి చెందిన వెంచర్ క్యాపిటలిస్ట్, మస్క్ స్నేహితుడు శ్రీరామ్ కృష్ణన్‌ని నియమించడంతో వివాదం ప్రారంభమైంది. ఈ నియామకంతో ట్రంప్, ఎలాన్ మస్క్ మద్దతుదారుల మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నైపుణ్యం కలిగిన వలసదారుల కోసం గ్రీన్‌కార్డ్‌పై ఉన్న పరిమితుల్ని తొలగించాలని ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు ట్రంప్ మద్దతుదారులకు రుచించడం లేదు. దీంతో ఇరు వర్గాల మధ్య సోషల్ మీడియాలో ఫైర్ స్టార్ట్ అయింది.
Read Also: Asaduddin Owaisi: సంభాల్ మసీదుకు ఎదురుగా పోలీస్ పోస్ట్.. యోగి నిర్ణయంపై ఓవైసీ ఫైర్..
కరుగుగట్టిన రైటిస్ట్ నేత లారా లూమర్, కృష్ణన్ నియామకాన్ని తీవ్రంగా కలవరపరిచేదిగా అభివర్ణించారు. మరోవైపు ప్రపంచకుబేరుడు గ్లోబల్ టాలెంట్‌ని ఆకర్షించాలనే తన అభిప్రాయం వైపు నిలబడ్డారు. నిజానికి ఎలాన్ మస్క్ స్వయంగా H-1B వీసాపై యునైటెడ్ స్టేట్స్‌కు వలస వచ్చారు. అమెరికా సాంకేతిక, ఆర్థిక ఆధిపత్యం ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ టాలెంట్‌ని నిమయించుకునే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని ట్రంప్ చెబుతున్నారు. “మీ టీమ్ ఛాంపియన్‌షిప్ గెలవాలని మీరు కోరుకుంటే, మీరు టాప్ టాలెంట్‌లను వారు ఎక్కడున్నా రిక్రూట్ చేసుకోవాలి” అని మిస్టర్ మస్క్ X లో పోస్ట్ చేసారు. భారత్‌లాంటి దేశాలకు పరిమితులు విధించొద్దని కోరుతున్నారు. మస్క్ అభిప్రాయాలనే వివేక రామస్వామి బలపరిచారు.
అయితే, ట్రంప్‌కి అత్యంత నమ్మకులైన మద్దతుదారులు మస్క్ ఇమ్మిగ్రేషన్ అనుకూల వైఖరిని విమర్శిస్తున్నారు. లూమర్, అన్ కౌల్టర్, మాజీ కాంగ్రెస్ సభ్యుడు మాట్ గేట్జ్ వంటి రైటిస్ట్ నాయకులు మస్క్, రామస్వామిలపై విరుచుకుపడ్డారు. వారు అమెరికన్ వర్కర్స్‌ని అణగదొక్కారని ఆరోపించారు. అమెరికన్లలో ప్రతిభకేం తక్కువ లేదని ట్రంప్ మద్దతుదారులు వాదిస్తున్నారు.