శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ఆస్పత్రి కారణంగా ఓ కరోనా రోగి మరణించింది. అసలు వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాలోని పెంట ఆగ్రహారం గ్రామానికి చెందిన కరోనాతో బాధపడుతోంది. వైద్యం కోసం ఆమెను కుటుంబ సభ్యులు బుధవారం రాజాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకోచ్చారు. రోగికి ఆరోగ్య శ్రీ వర్తించకపోవడంతో ముందుగా డబ్బు చెల్లించాలని ఆస్పత్రి యాజమాన్యం చెప్పింది. అయితే డబ్బు రూపంలో మాత్రమే ఫీజు చెల్లించాలని, ఆన్లైన్ పేమెంట్స్ అంగీకరించబోమని ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది. దీంతో బాధిత మహిళా కుటుంబ సభ్యులు ఎటిఎం నుంచి నగదు విత్ డ్రా చేయడం గంటల పాటు పట్టణామంతా తిరిగారు. అయినా ఫలితం లేకపోయింది. వారు వచ్చేసరికి మహిళ పరిస్థితి ఆస్పత్రి ఎదుట రోడ్డుపైనే మృతి చెందింది. ఆస్పత్రి యాజమాన్యం తీరు వల్లే తమ తల్లి మృతి చెందిందని బాధిత మహిళా కుమారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక చివరికి రాజాం ప్రెస్ సభ్యులు, రెడ్ క్రాస్ సభ్యులు ఏర్పాటు చేసిన వాహనంలో మృతదేహాన్ని తరలించారు.