కరోనా థర్డ్ వేవ్.. చిన్నారులపైనే ఎక్కువ ప్రభావం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అమెరికాలో అయితే పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ దేశంలో రోజుకు దాదాపు 10 లక్షల కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈసారి బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారని అమెరికా సీడీసీ వెల్లడించింది. ముఖ్యంగా బాధితుల్లో ఐదేళ్లు లోపు చిన్నారులు ఉన్నారని తెలిపింది. ఇటీవలి కాలంలో కరోనా బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్న ఐదేళ్ల లోపు చిన్నారుల సంఖ్య పెరుగుతోందంటూ అమెరికా సీడీసీ డేటాను విడుదల చేసింది. 14 రాష్ట్రాల్లోని 250 ఆసుపత్రుల్లోని పేషెంట్ల ఆధారంగా ఈ వివరాలను వెల్లడించింది.
Read Also: బీ అలర్ట్ : రెండు వారాల్లో గరిష్ఠ స్థాయికి ఒమిక్రాన్!
Also Read
- Pakistan Hindu Girls: కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. పాకిస్తాన్ కోర్టు బయట హిందూ బాలికల కన్నీళ్లు!
- Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
- Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్‌కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
కరోనా కేసులు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఎక్కువ మంది పిల్లలు ఆసుపత్రి పాలవుతున్న సందర్భం ఇదేనని సీడీసీ చీఫ్ డాక్టర్ రోచెల్ వాలెన్ స్కీ వెల్లడించారు. ఆసుపత్రుల్లో చేరుతున్న చిన్నారుల్లో 50 శాతం మంది 12 నుంచి 18 ఏళ్ల మధ్యవారని తెలిపారు. 5 నుంచి 11 ఏళ్ల మధ్య వారు 16 శాతం మంది ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం వీరందరికీ పూర్తిగా వ్యాక్సినేషన్ జరిగిందని.. అయినా కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగించే విషయమని సీడీసీ చీఫ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు అమెరికాలో ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసుల్లో 95 శాతం ఒమిక్రాన్ వేరియంట్‌వే ఉంటున్నాయని అధికారులు చెప్తున్నారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే భారత్‌లో కరోనా థర్డ్ వేవ్‌లో వైరస్ మహమ్మారి చిన్నారులపై కూడా అధికంగా ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Marpally : పంచాయతీరాజ్ శాఖలో కీలక మార్పు.. మర్పల్లి ఇక వికారాబాద్ డివిజన్లో
-
Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి ‘హనుమాన్ అంశ్’ – సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
-
Delimitation Bills: నవరాత్రుల్లో ముహూర్తం.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై కేంద్రం కసరత్తు!
-
Modi-Putin: “కార్ డిప్లమసీ”.. ఒకే కారులో మోడీ-పుతిన్..
-
ED raids : హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు.. AMR గ్రూప్‌పై సోదాలు..?
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?