ప్రస్తుతం ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్నాయి. ఓ వైపు పెరుగుతున్న ఇంధన ధరలు, మరోవైపు కాలుష్యం ఈ రెండింటి నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు నజర్ పెడుతున్నాయి. ఇప్పటికే ఇండియాలోని పలు రాష్ట్రాలు ఈవీ లకు పలు రాయితీలు ప్రకటిస్తున్నారు. ఇటు టూవీలర్లే కాకుండా ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ కూడా పెరిగాయి. ముఖ్యంగా ఇండియాలో టాటా నెక్సాన్ ఈవీ, ఎంజీ జెడ్ ఎస్ ఈవీ, హ్యుందాయ్ కోనా, మహీంద్రా, కియా నుంచి కూడా ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్ లోకి తీసుకువచ్చాయి. అయితే ఇక్కడ రేంజ్ విషయంలోనే సమస్య ఎదురవుతోంది. ప్రస్తుతం ఉన్న ఈవీ కార్లు కేవలం 300-500 కిలోమీటర్ల రేంజ్ కే పరిమితం అయ్యాయి.
ఇదిలా ఉంటే తాజాగా చైనాకు చెందిన ఆలోమోటివ్ లిథియం అయాన్ బ్యాటరీ ఉత్పత్తి సంస్థల్లో ఒకటైన కాంటెంపరరీ ఆంపెరెక్స్ టెక్నాలజీ కో లిమిటెడ్(సీఏటీఎల్) సరికొత్త బ్యాటరీని ఆవిష్కరించింది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 1000 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఇచ్చేలా బ్యాటరీని తయారు చేసింది. సెల్ టూ ప్యాక్ (సీటీపీ) సాంకేతికతతో మూడవ తరం క్విలిన్ గా పిలువబడే సీటీపీ 3.0 బ్యాటరీ ప్యాక్ ను తయారు చేసింది. దాదాపు 72 శాతం వాల్యూమ్ యుటిలిస్టైటన్ సామర్థ్యం ఈ బ్యాటరీ సొంతం. బ్యాటరీ ప్యాక్ టెర్నరీ బ్యాటరీ సిస్టమ్స్ కోసం 255 వాట్ అవర్/ కేజీ శక్తి సాంద్రతను ఈ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ 2023లో మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు.
మాడ్యుల్స్ లేకుండా సెల్ లను నేరుగా ప్యాక్ లోకి చేర్చడం ద్వారా సీటీపీ టెక్నాలజీ సిస్టమ్ ఎనర్జీ డెన్సిటీని మెరుగుపరుస్తుందని, ఈ టెక్నాలజీ బ్యాటరీ తయారీని సులువు చేయడంతో పాటు, ఖర్చులను కూడా తగ్గించడంతో సహాయపడుతుందని, బ్యాటరీ లైఫ్, భద్రత, ఛార్జింగ్ వేగం పెరుగుతుందని కంపెనీ చెబుతోంది. కొత్తగా వస్తున్న క్విలిన్ బ్యాటరీ థర్మల్ స్టెబిలిటీ, సెఫ్టీని కలిగి ఉంటుందని, విపరీత పరిస్థితుల్లో అత్యంత వేగంగా చల్లబడుతుందని కంపెనీ చెబుతోంది.