Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News China People Suffering With Lockdown

China Crisis: కఠిన లాక్ డౌన్.. అల్లాడుతున్న జనం

Published Date :April 13, 2022 , 3:58 pm
By NTV WebDesk
China Crisis: కఠిన లాక్ డౌన్.. అల్లాడుతున్న జనం
  • Follow Us :
  • google news
  • dailyhunt

కరోనాకు పుట్టినిలైన చైనాను మహమ్మారి మరోసారి కుదిపేస్తోంది. షాంఘైలో కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. దీంతో ఆకలి కేకలతో చైనా అల్లాడిపోతోంది. కరోనా కఠిన లాక్‌డౌన్‌తో జనం అల్లాడిపోతున్నారు. తినడానికి తిండి దొరకడం లేదని ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్నా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నిత్యం 20వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం గరిష్ఠంగా ఒక్కరోజే 25 వేల కేసులు రికార్డయ్యాయి. మార్చిలో కరోనా తీవ్రత పెరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షా 70 వేల కేసులు వెలుగుచూశాయి.

కరోనా కట్టడిలో భాగంగా ఏప్రిల్‌ 1 నుంచి షాంఘై మహా నగరంలో లాక్‌డౌన్‌ విధిస్తున్నారు. మొదట 5 రోజులే లాక్‌డౌన్‌ విధిస్తామన్న అధికారులు..వైరస్‌ ఉద్ధృతి తగ్గకపోవడంతో దాన్ని కంటిన్యూ చేశారు. దాంతో ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. ఓవైపు ఇళ్లకే పరిమితం కావడం, మరోవైపు నిత్యవసరాల కొరతతో షాంఘై వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వృద్ధులకు ఔషధాలు పొందడం కూడా ఇబ్బందిగా మారింది. ఇలా కనీసం తిండి కూడా దొరకడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న షాంఘై పౌరులు భవనాల కిటికీలు, బాల్కనీల్లోకి వచ్చి పెద్దగా అరుస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Also Read

  • UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..
  • UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
  • Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్‌కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
  • China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు

లాక్‌డౌన్‌ కారణంగా ఆహారం, నిత్యవసరాలను స్థానిక అధికారులు పంపిణీ చేస్తున్నా వాటి కొరత వేధిస్తోంది. సూపర్‌ మార్కెట్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడమే కాకుండా వాటిని లూటీ చేసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు షాంఘై వాసుల ఆకలి కేకలపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలా చేయడం వల్ల వైరస్‌ మరింత వ్యాపిస్తుందని చెబుతున్నారు. దీంతో డ్రోన్లను రంగంలోకి దింపిన అధికారులు.. కోరికలను నియంత్రించుకోండి. పాటలు పాడడానికి కిటికీలు తెరవొద్దని హెచ్చరికలు చేస్తున్నారు.

ఇంకోవైపు వైద్య సిబ్బంది కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఓ కొవిడ్‌ ఐసోలేషన్‌లో వైద్యుడు కుప్పుకూలిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఐసోలేషన్‌ కేంద్రాల్లోనే వారికి చికిత్స అందిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. మొత్తంగా కరోనా మహమ్మారి చైనాల్లో కల్లోలం సృష్టిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • china
  • china people
  • corona Cases
  • covid
  • covid alert

తాజావార్తలు

  • UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..

  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!

  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్

  • The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?

  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions