ఉక్రెయిన్ రష్యా మధ్య వార్ తీవ్రస్థాయిలో జరుగుతున్నది. కీలకమైన నగరాలను రష్యా ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంటూ వస్తున్నది. అయితే, కీవ్‌కు సమీపంలో రష్యా సేనలు ప్రవేశించడంతో భీకర పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌లో సుమారు 6 వేల మందికి పైగా చైనీయులు ఉన్నారు. వీరంతా ఇప్పుడు ఆ దేశంలోనే చిక్కుకుపోయారు. అక్కడి నుంచి సురక్షితంగా తరలించేందుకు ఎలాంటి అవకాశాలు లేవని, కీవ్ నరగంలో ఉన్న చైనీయులు అర్ధం చేసుకోవాలని చైనా రాయబారి ఫ్యాన్ షియాన్‌రాంగ్ పేర్కొన్నారు.
Read: North Korea: ఉక్రెయిన్ సంక్షోభానికి అమెరికానే కారణం…
నగరంలోని ప్రతి చైనీయుడిని సురక్షితంగా సొంత ప్రాంతాలకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. స్థానికులతో ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దని, ఉక్రెయిన్ ప్రజలు ప్రస్తుతం ఆందోళనకర స్థితులో ఉన్నారని, వారిని మానవతాదృక్పదంలో అర్ధం చేసుకోవాలని చైనా రాయబారి ఫ్యాన్ షియాన్‌రాంగ్ పేర్కొన్నారు. ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాలని రాయబారి ఫ్యాన్ తెలియజేశారు.