Rare-earth minerals: అమెరికా, చైనాల మధ్య రేర్-ఎర్త్ ఖనిజాల కోసం పెద్ద ట్రేడ్ వార్ జరుగుతోంది. చైనా తాజాగా రేర్ ఎర్త్ మెటీరియల్ ఎగుమతులపై నియంత్రణను కఠినతరం చేసింది. ఇది అమెరికాకు కోపం తెప్పించింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్, ఏకంగా చైనా ఉత్పత్తులపై 100 శాతం సుంకాలను విధించాడు. చైనా తన అరుదైన ఖనిజాలను ఎగుమతిని నియంత్రించడంతో పాటు, ప్రాసెసింగ్ టెక్నాలజీని పరిమితం చేసింది. రక్షణ, సెమీ కండర్టర్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది.
Read Also: Dhan Dhanya Yojana: రైతులకు మోడీ కానుక.. రూ.24 వేల కోట్ల ధన్ ధన్య పథకాన్ని ప్రారంభించిన ప్రధాని..
ఇదిలా ఉంటే, భారత్ కూడా రేర్ ఎర్త్ అయస్కాంతాల కోసం చైనాపైనే ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో, భారత్కు ఎగుమతి చేసే అరుదైన అయస్కాంతాలను అమెరికాకు తిరిగి ఎగుమతి చేయకూడదని చైనా, మన దేశం నుంచి హామీ కోరుతున్నట్లు సమాచారం. ప్రపంచంలో ప్రాసెస్ చేయబడిన రేర్ ఎర్త్ మెటీరియల్స్, అయస్కాంతాల్లో 90 శాతం కంటే ఎక్కువ చైనానే ఉత్పత్తి చేస్తోంది. ఈ 17 రకాల అరుదైన మూలకాలు ఎలక్ట్రిక్ వాహనాల (ev)ల తయారీ నుంచి విమాన ఇంజన్లు, సైనిక రాడార్ల వంటి ఉత్పత్తుల్లో ఇవి కీలకంగా ఉంటాయి.
భారతదేశానికి సరఫరా చేసే రేర్ ఎర్త్ అయస్కాంతాలు అమెరికాకు చేరకుండా చూడాలని చైనా కోరుతోంది. అయితే, భారత ప్రభుత్వం ఇప్పటి వరకు ఇలాంటి అభ్యర్థనను అంగీకరించలేదని విషయం తెలిసిన వ్యక్తులు చెబుతున్నారు. చైనా ఈ రేర్ ఎర్త్ మెటీరియల్ ద్వారా అమెరికాతో ఏదో ఒక డీల్ కుదుర్చుకోవాలని, బేరసారాలు చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ ఖనిజాలను ప్రాసెస్ చేసే టెక్నాలజీపై కూడా చైనా నియంత్రణ విధిస్తోంది. దక్షిణ కొరియాలో అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, జి జిన్పింగ్ మధ్య సమావేశం జరగడానికి వారాల ముందు నియంత్రణలను కఠినతరం చేయడం జరిగింది.